ఆకట్టుకుంటున్న ‘యుద్ధం లేని రోజులు రావాలే’ సాంగ్
నూతన సంవత్సరం సందర్భంగా స్వాగతం పలుకుతూ ప్రముఖ రచయిత రాసిన ‘యుద్ధం లేని రోజులు రావాలే’ అనే సాంగ్ ఆకట్టుకుంటోంది..
దిశ, వెబ్ డెస్క్: తెలుగు ప్రజలు నూతన సంవత్సరాన్ని ఆహ్వానించారు. ఆట పాటలతో అదరగొడుతూ కొత్త ఏడాదిని స్వాగతించారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత గడ్డమీది చంద్రమోహన్ గౌడ్ ఓ పాటను ఆవిష్కరించారు. ప్రపంచ శాంతిని, ప్రగతి వికాసాన్ని ఆకాంక్షిస్తూ ఆయన రాసి పాడిన పాట ప్రస్తుతం వైరల్ అయింది. ఈ పాటలోని పల్లవి, అనుపల్లవి, చరణాలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటను అంకితమిస్తూ ప్రజలకు చంద్రమోహన్ గౌడ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
కొత్త వసంతానికి స్వాగతం
యుద్ధం లేని రోజులు రావాలే
మనశ్శాంతి లేని సమాజం పోవాలే
శాంతి పావురాలు నిర్భయంగా ఎగరాలే
విశ్వశాంతి విశ్వమంతా విరబూయాలే
ఐక్యరాజ్యసమితి ముందుకు రావాలనే
ఆయుధాల ఉత్పత్తిని కట్టడి చేయాలే
అన్ని దేశాలు పంతాలు,పట్టింపులీడాలే
పోరు సమరంలో ఆధిపత్యం వీడనాడాలే
స్వార్థమనే మాట మాని సమాజహితమై
మారణహోమాన్ని ఆపుతూ..
ప్రపంచ శాంతిని కోరుతూ..
సకలదేశాల సఖ్యతతో మమేకమై
ప్రపంచ ప్రగతి వికాసం కోరుతూ..
ఈ నూతన సంవత్సరం కావాలే
మరో కొత్త ప్రపంచానికి నాంది
ప్రగతి బాటలో సాగాలని ఆశిస్తూ...
ఆకాంక్షిస్తూ కొత్త వసంతానికి స్వాగతం
పలుకుతున్నాను స్వాగతం
-గడ్డమీది చంద్రమోహన్ గౌడ్