సాగర్లో తగ్గుముఖం పట్టిన వరద
నాగార్జునసాగర్ రిజర్వాయర్ కు గత మూడు రోజుల నుండి 5 లక్షల క్యూసెక్కుల పై చిలుకు భారీ వరద కొనసాగింది.
దిశ, నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ రిజర్వాయర్ కు గత మూడు రోజుల నుండి 5 లక్షల క్యూసెక్కుల పై చిలుకు భారీ వరద కొనసాగింది. మంగళవారం కొంతమేర వరద తగ్గుముఖం పట్టింది. ఎగువ కృష్ణానది పరీవాహక ప్రాంతాల నుండి శ్రీశైలం జలాశయంకు వరద కొనసాగుతుండటంతో క్రష్ట్ గేట్లను, జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 3,04,155 క్యూసెక్కుల వరద నీటిని దిగువనున్న నాగార్జునసాగర్ రిజర్వాయర్ కు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్ డ్యామ్ 26 క్రష్ట్ గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.10 గేట్లను 10 అడుగులు,16 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 2,64,642 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ డ్యామ్ సమాచారం
నాగార్జునసాగర్ డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 585.90 అడుగులవద్ద నీరు నిల్వవుంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 300.0315 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 29,435 క్యూసెక్కుల నీటిని కుడి కాలువ ద్వారా 7678 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎడమ కాల్వద్వారా నీటి విడుదల చేయడం లేదు. ఎస్ఎల్బీసీ ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని, లోలేవల్ కెనాల్ ద్వారా 600క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ నుండి వచ్చిన నీటిని వచ్చినట్లు మొత్తం 3,04,155 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.