సర్వేలు గురుకుల ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలి.. విద్యార్థి సంఘాలు..

సర్వేలు గురుకుల పాఠశాలలో బుధవారం జరిగిన సంఘటన పై అఖిలపక్ష విద్యార్థి సంఘాలు గురువారం భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Update: 2024-12-19 08:00 GMT

దిశ, సంస్థాన్ నారాయణపురం : సర్వేలు గురుకుల పాఠశాలలో బుధవారం జరిగిన సంఘటన పై అఖిలపక్ష విద్యార్థి సంఘాలు గురువారం భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం ఉదయం రాగి జావ వడ్డిస్తుండగా విద్యార్థి పై పడడంతో తీవ్రగాయాల పాలయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. దీంతో జరిగిన సంఘటనకు బాధ్యులైన ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ బీజేవైఎం, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, బీఆర్ఎస్వీ సంఘాల నాయకులు పాఠశాల ముందు ధర్నాకు దిగారు.

ఈ సమయంలో పాఠశాల లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నం చేయగా పోలీసులకు విద్యార్థి సంఘాల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకుల చేతులను పోలీసులు విరిచారు అంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపు పాఠశాల ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొనగా చివరకు సద్దుమణిగింది. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పాఠశాల సందర్శనకు వచ్చే వరకు తమ ధర్నాను విరమించేది లేదని పాఠశాల గేటు ముందు భీష్మించి కూర్చున్నారు.


Similar News