జాజుల శ్రీనివాస్ గౌడ్ కు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలి
గత కొన్నేళ్లుగా బీసీల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కు ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయనకు సముచిత స్థానం కల్పించాలని చౌటుప్పల్ అయ్యప్ప ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు బొబ్బిల్ల మురళి కోరారు
దిశ, చౌటుప్పల్ టౌన్ : గత కొన్నేళ్లుగా బీసీల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కు ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయనకు సముచిత స్థానం కల్పించాలని చౌటుప్పల్ అయ్యప్ప ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు బొబ్బిల్ల మురళి కోరారు. శ్రీనివాస్ గౌడ్ గురువారం నాడు చౌటుప్పల్ లోని శ్రీ సత్యదేవ సహిత అయ్యప్ప ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ బృందం శ్రీనివాస్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా ఆలయానికి ఆహ్వానించి, వేద పండితులతో ఆశీర్వాదం, దీవెనలు తీసుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ బృందం ఆయనను పూల మాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా బొబ్బిల్ల మురళి మాట్లాడుతూ..బీసీల కోసం నిరంత పోరాటం చేస్తున్న వ్యక్తులను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పాటి శంకర్, చింతల సాయిలు, అంతటి రాము గౌడ్, పెద్దగోని రమేష్ గౌడ్, సుక్క సుదర్శన్, కందుల వెంకటేశం గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.