అద్దె చెల్లించడం లేదని పాఠశాల భవనానికి తాళం..

మున్సిపల్ కేంద్రంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలకు భవనానికి అద్దె చెల్లించడం లేదని భవన యజమాని మంగళవారం గేటుకు తాళం వేశారు.

Update: 2024-10-15 05:16 GMT

దిశ, మోత్కూరు : మున్సిపల్ కేంద్రంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలకు భవనానికి అద్దె చెల్లించడం లేదని భవన యజమాని మంగళవారం గేటుకు తాళం వేశారు. 9 నెలలుగా భవనానికి అద్దె చెల్లించడం లేదని మూడు నెలలుగా ప్రిన్సిపాల్ జోనల్ ఆఫీసర్ కమిషనర్ దృష్టికి అద్దె విషయం తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో భవనానికి తాళం వేస్తానని సోమవారం గేటుకు ఫ్లెక్సీని కట్టారు.

ఒకవేళ అసౌకర్యం కలిగితే దానికి తాను చింతిస్తున్నానని ప్రకటించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. భవన యజమాని వచ్చి తాళం వేస్తుండగా ప్రిన్సిపాల్, సిబ్బంది అధికారులతో మాట్లాడతామని చెప్పినా వినకుండా గేటుకు తాళం వేసుకుని వెళ్లిపోయారు. దీంతో పాఠశాలలో ఉన్న ప్రిన్సిపాల్ ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకుపోయినట్లు సమాచారం. అద్దె చెల్లించకపోవడంతో పాఠశాల భవనం గేటుకు తాళం వేసిన విషయమై మున్సిపల్ కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది.


Similar News