వృద్ధాప్యంలోనూ బాధలు తప్పడం లేదు.. ఓ తల్లి ఆవేదన..

కోదాడ పట్టణంలో గాంధీనగర్ కు చెందిన సోమపంగు వెంకమ్మ కోదాడ మున్సిపాలిటీలో కామాటిగా విధులు నిర్వహించి పదివీవిరమణ పొందారు.

Update: 2024-10-15 03:20 GMT

దిశ, కోదాడ : కోదాడ పట్టణంలో గాంధీనగర్ కు చెందిన సోమపంగు వెంకమ్మ కోదాడ మున్సిపాలిటీలో కామాటిగా విధులు నిర్వహించి పదివీవిరమణ పొందారు. ఈ క్రమంలో తనకు ఉన్న ఒక్కగాను ఒక్క కొడుకు, కోడలు తనని చూడకుండా తనని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కనీసం తన కడుపుకి పిడికెడు అన్నం కూడా పెట్టడం లేదంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. పదవీ విరమణ పొందిన తరువాత తనకు వచ్చే రూ.35,000 పింఛన్లు కూడా తన వద్ద నుంచి తన కొడుకు కోడలు లాక్కుంటున్నారని, అలాగే తన పేరు మీద ఉన్న ఎకరంన్నర భూమిని, తన ఇంటిని కూడా తన కోడలే తన పేరు మీదకు బలవంతంగా రాయించుకున్నదని భావోద్వేగానికి లోనయ్యింది. తన తరుపున మాట్లాడడానికి వచ్చిన తన కుతుర్ల పై కూడా కేసులు పెడుతున్నారని, తన తరపున మాట్లాడడానికి వచ్చిన వాళ్ళ పై కేసులు పెడతామని తమ కోడలు అందరినీ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలంటూ కోదాడ ఆర్డిఓ కార్యాలయంలో ఉన్న డీఎవో రామకృష్ణ రెడ్డికు, తన గోడును చెప్తూ కాళ్లపై పడి వినతిపత్రం అందజేసింది.


Similar News