కేసు పెట్టిన పోలీసులు పట్టించుకోవడం లేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

కేసు పెట్టిన పోలీసులు పట్టించుకోవడం లేదని పైగా తనపై వేధింపులకు గురి చేస్తున్నారని దామరచర్ల మండలానికి చెందిన వ్యక్తి సెల్ఫీ వీడియో అనంతరం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది.

Update: 2024-06-26 13:27 GMT

దిశ, మిర్యాలగూడ : కేసు పెట్టిన పోలీసులు పట్టించుకోవడం లేదని పైగా తనపై వేధింపులకు గురి చేస్తున్నారని దామరచర్ల మండలానికి చెందిన వ్యక్తి సెల్ఫీ వీడియో అనంతరం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దామరచర్ల మండలం గణేష్ పహాడ్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త సైదా నాయక్ గత రెండు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

దీంతో పాటు ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికల సమయంలో జరిగిన గొడవల్లో అతనిపై దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలని వాడపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తను పెట్టిన పిటిషన్ పై చర్యలు తీసుకోకుండా తనపైనే వేధింపులకు పాల్పడుతున్నారని సెల్ఫీ వీడియో తీసుకొని పురుగుల మందు తాగి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వెంటనే పోలీసులు మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Similar News