బంగారు రాజు జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి.. డీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరాజు..

బంగారు రాజు జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని డెక్కన్ సిమెంట్ పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరాజు అన్నారు.

Update: 2023-06-29 15:52 GMT

దిశ, నేరేడుచర్ల (పాలకవీడు) : బంగారు రాజు జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని డెక్కన్ సిమెంట్ పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరాజు అన్నారు. గురువారం పాలకవీడు మండలంలోని డెక్కన్ సిమెంట్ పరిశ్రమలో ఆ పరిశ్రమ అధినేత బంగారు రాజు సంతాప సభను పరిశ్రమ ఉద్యోగులు సిబ్బంది కార్మికుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ చిన్నప్పటి నుండే బంగార్రాజు తనకష్టాన్ని నమ్ముకుని స్వసక్తితో ఎదిగాడని కొనియాడారు. చదువుల్లో రాణించి ఇంజనీరింగ్ చేసి ఓ పరిశ్రమలో పనిచేసి ఆయనే స్వయంగా ఒక పరిశ్రమను స్థాపించాడని అన్నారు.

బంగారు రాజు ఎక్కడో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని పెద్ద కాపవరం జన్మించి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేసి ఎంతో మంది నిరుద్యోగులకు కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. ఈ ప్రాంతం మీద ఇక్కడ ప్రజల మీద ఎంతో ప్రేమ అభిమానం ఉందని ఆయనను కూడా ఈ ప్రాంత ప్రజలు ఆ విధంగానే చూసుకున్నారని తెలిపారు. వ్యక్తి అనుకుంటే సాధించలేదని ఏమి ఉండదని దీనికి చెప్పడానికి నిదర్శనం బంగారు రాజుని చెప్పుకోవచ్చు అని తెలిపారు. బంగార్రాజు ఎంతో కష్టపడి ఈ రోజు ఫ్యాక్టరీని ఈ స్థాయికి తీసుకువచ్చారని అన్నారు. ఆయనను యువత అంతా ఆదర్శంగా తీసుకోవాలని భవిష్యత్తులో ఎంతో ఎదగాలని సూచించారు.

అనంతరం బంగారు రాజు సంతాప సభ సందర్భంగా 3000 మందికి వైస్ ప్రెసిడెంట్ రాజు సీజీఎం నాగమల్లేశ్వర రావు ఆధ్వర్యంలో పరిశ్రమ ఉద్యోగులు సిబ్బంది కార్మికుల చుట్టుపక్క గ్రామాల ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ జనరల్ మేనేజర్ నాగమల్లేశ్వరరావు పాలకవీడు ఎంపీపీ భూక్య గోపాల్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు కిష్టిపాటి అంజిరెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి రైతు సమితి జిల్లా సభ్యులు మలమంటి దుర్గారావు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దేవి రెడ్డి వెంకట్ రెడ్డి బెట్టెతండ, సర్పంచ్ మోతిలాల్ నాయక్ పరిశ్రమ ఉద్యోగులు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు సిబ్బంది కార్మికులు ప్రజలు పాల్గొన్నారు.

Tags:    

Similar News