మూసీ నదిని పునరుజ్జీవింపజేయడమే ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే
కాలుష్య కాసారంగా మారిన మూసీ నదిని పునరుజ్జీవింపజేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ తక్షణ కర్తవ్యమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.
దిశ, రామన్నపేట : కాలుష్య కాసారంగా మారిన మూసీ నదిని పునరుజ్జీవింపజేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ తక్షణ కర్తవ్యమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం వలిగొండ మండలం నెమలి కాలువ నుండి రామన్నపేట మండలం తుమ్మల గూడెం వరకు ప్రవహిస్తున్న మూసి కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ సఫలం అయితేనే ఉమ్మడి జిల్లా మూసీ పరివాహక రైతాంగ కన్నీటి బాధలు తీరుతాయని అన్నారు.
రాజకీయాలకతీతంగా మూసి ప్రక్షాళనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు. జిల్లా నాయకులు పూస బాలకిషన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెద్దగొని వెంకటేష్, సింగిల్ విండో డైరెక్టర్ నాగు ఆంజనేయులు, మాజీ ఉపసర్పంచ్ గర్దాసు సురేష్, నాయకులు మందడి గోపాల్ రెడ్డి, మండల జానీ, రుద్రాల గోపాల్, చిన్నపాక స్వామి, చిన్నపాక ప్రభాకర్, వరికుప్పల రాజమల్లు, నక్క వెంకటేష్, మిర్యాల వెంకన్న, మంటి మల్లేష్, గర్దాసు రాఘవులు, పలుగుల మల్లేష్, రాధా రపు మహేష్, నల్ల ఎల్లెష్, బట్టు విజయ్, పుట్టల నరసింహ, ఉల్లె కృష్ణ, మేకల నరేష్, బంగారిగల్ల దాని, గార్ధసు వేణు, రుద్రాల విక్కీ, పూస అర్జున్, పబ్బు మచ్చేందర్, కేస సాయి, మోల్క సాయి, కేస సందీప్ తదితరులు పాల్గొన్నారు.