ఆనాడు నేను చదువుకుంది చెట్లకిందనే

నా బాల్యంలో నేను చదువుకునేటప్పుడు ప్రభుత్వ పాఠశాలలో వసతులు సరిగ్గా లేకపోవడంతో చెట్లకిందనే విద్యనభ్యసించానని, నాలాగా ఏ విద్యార్థి ఇబ్బందిపడొద్దని నియోజకవర్గంలో ప్రతి ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేస్తున్నానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

Update: 2024-09-27 10:00 GMT

దిశ, మునుగోడు : నా బాల్యంలో నేను చదువుకునేటప్పుడు ప్రభుత్వ పాఠశాలలో వసతులు సరిగ్గా లేకపోవడంతో చెట్లకిందనే విద్యనభ్యసించానని, నాలాగా ఏ విద్యార్థి ఇబ్బందిపడొద్దని నియోజకవర్గంలో ప్రతి ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేస్తున్నానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మునుగోడు మండలంలోని పులిపలుపుల, సింగారం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మౌళిక వసతులు, గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్కూళ్లు దేవాలయాలతో సమానమని, బడి బాగుంటే ఆ గ్రామం, ఆ ప్రాంతం బాగుపడుతుందని అన్నారు. పులిపలుపుల గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల అభివృద్ధికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ నుండి పది లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు.

     గ్రామాలలోని పలు సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఫోన్ చేసి పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాలలో విద్యా, వైద్యంతోపాటు డ్రైనేజీ వ్యవస్థ పకడ్బందీగా ఉండాలన్నారు. గ్రామాలలో విద్యుత్ లైన్లు ఇబ్బందికరంగా ఉన్నాయని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా విద్యుత్ డీఈకి ఫోన్ చేసి ఎటువంటి విద్యుత్ సమస్య లేకుండా చూడాలన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఇటీవల నిధులు మంజూరు చేయించామని, సింగారం నుండి పనులు మొదలు పెట్టాలన్నారు. బెల్ట్ షాపులు నిర్మూలించిన గ్రామాలకు నిధులు కేటాయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ నల్లగొండ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, మునుగోడు మండల ప్రత్యేక అధికారి మురళి, డిప్యూటీ తహసీల్ధార్ నరేష్, పంచాయతీ రాజ్ ఏఈ సతీష్ రెడ్డి, ఇంట్రా ఏఈ మనిదీప్, విద్యుత్ ఏఈ సురేష్, సింగారం గ్రామపంచాయతీ కార్యదర్శి గీత పాల్గొన్నారు.

Tags:    

Similar News