తెలంగాణలో మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి మహిళలు అన్ని రంగాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాధాన్యత కల్పిస్తు ముందు ఉంచారని హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.

Update: 2023-06-14 05:30 GMT

దిశ, నేరేడుచర్ల: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి మహిళలు అన్ని రంగాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాధాన్యత కల్పిస్తు ముందు ఉంచారని హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మంగళవారం హుజూర్‌నగర్ పట్టణంలోని లక్ష్మి నరసింహ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహిళా సంక్షేమ దినోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే సైదిరెడ్డి సతీమణి రజితతో పాల్గొని మాట్లాడారు. మహిళలు రాత్రి పగలు స్వతంత్రంగా రోడ్లపై తిరిగేందుకు ప్రత్యేకంగా షి టీంలను ఏర్పాటు చేసిందని అన్నారు. ఇటీవలన మహిళలు స్వేచ్ఛగా వారి విధులు నిర్వహించుకోవడంతోపాటు ధైర్యంగా కాలేజీలకు, స్కూల్‌లకూ వెళ్తున్నారని అన్నారు.

కరోనా సమయంలో మహిళా అధికారులు, అంగనవాడి టీచర్లు, హెల్త్ డిపార్ట్మెంట్‌లో ఉన్న మహిళ డాక్టర్లు, సిబ్బంది చేసిన శ్రమ మాటల్లో చెప్పలేదని వారిని కొనియాడారు. ఆడబిడ్డ పెళ్ళికి కల్యాణ లక్ష్మి మొదలుకొని డెలివరీ అయిన తర్వాత ఇచ్చే కెసిఆర్ కిట్టు అందిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌కే దక్కుతుందని అన్నారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతం చేశారు. మహిళా అధికారులకు ప్రజాప్రతినిధులకు సన్మానం, చిన్న పిల్లలకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేశారు. సంస్కృతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ మున్సిపాలిటీ చైర్మన్ గెల్లి అర్చన రవి, నేరేడుచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ చల్లా శ్రీలత రెడ్డి, డీపీఓ యాదయ్య, మలేరియా జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాహితీ, మహిళా ఎంపీపీలు పార్వతి, జ్యోతి, సుజాత, జడ్పీటీసీలు ప్రజాప్రతినిధులు అధికారులు నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News