అభివృద్ధి పనుల్లో నాణ్యత లేకపోతే సహించేది లేదు...

మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా చేపట్టాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులకు సూచించారు.

Update: 2024-11-17 10:27 GMT

దిశ, చండూరు : మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా చేపట్టాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులకు సూచించారు. రోడ్డు విస్తరణ పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. పనుల్లో నాణ్యత లేకపోతే సహించేది లేదని, నాణ్యతతో రోడ్డు నిర్మాణం జరగాలని గుత్తేదారును ఆదేశించారు. సీసీ రోడ్డు నిర్మాణం నాణ్యతగా ఉందా లేదా సిసి రోడ్డు నిర్మాణం పూర్తయ్యాక వర్షపు నీరు ఎటువైపు వెళుతుందనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీరు వెళ్లే ప్రాంతంలో పైపుల సైజు పెంచాలని సూచించారు. మిషన్ భగీరథ పైప్ లైన్ల తోపాటు..మున్సిపాలిటీ నీటి పైపులైన్లు ఎటువైపు వెళుతున్నాయని ఆరా తీశారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల భవిష్యత్తు కాలంలో కూడా డ్రైనేజీ వాటర్ నిల్వ ఉండకుండా సజావుగా వెళ్లేలా రోడ్డు మధ్యలో క్రాసింగ్ ల సంఖ్య పెంచాలని అన్నారు. డ్రైనేజీ చివర్ల వరకు 84 ఫీట్ల వరకు ఉంటుందని మరో ఆరు ఫీట్లు పెంచినట్లయితే భవిష్యత్తులో ఎటువంటి కేబుల్స్ కానీ..పైపులైన్లు గాని వేసుకోవడానికి వేసులుబాటుగా ఉంటుందని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మున్సిపాలిటీకి సంబంధించి మాస్టర్ ప్లాన్ తయారు చేయించి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అంతకుముందు చండూరు మున్సిపల్ కార్యాలయంలో స్త్రీ శక్తి లోన్ ద్వారా నిర్మించుకున్న ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఆయన ప్రారంభించారు . ప్రజలు క్యాంటిన్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

నాగమణికి ఇచ్చిన మాటను నెరవేర్చిన ఎమ్మెల్యే..

గతంలో చండూరు మండల పరిధిలోని చామలపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ పర్యటించారు. నాగమణి అనే యువతి  ఇంటి ముందు సీసీ రోడ్డు నిర్మించాలని కోరడంతో..అప్పుడు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యేకు నాగమణితో పాటు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు గ్రామంలో శ్రీశ్రీశ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం కళాతోరణ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా మండలంలోని చొప్పరి వారి గూడెంలో 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఆదివారం శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకటేష్ యాదవ్, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు కోరిమి ఓంకారం, అనంత చంద్రశేఖర్ గౌడ్,మాజీ సర్పంచ్ చొప్పరి అనురాధ వెంకన్న,కోడి శ్రీనివాస్, నల్లగంటి మల్లేష్,బూతరాజు ఆంజనేయులు కావలి ఆంజనేయులు, కాటం రవి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Similar News