ఏ నిమిశానికి ఏమి జరుగునో.. సాగర్ లో టెన్షన్.. టెన్షన్
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద హై టెన్షన్ కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యాం పై పోలీసులు పహారా కాస్తున్నారు.
దిశ, నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద హై టెన్షన్ కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యాం పై పోలీసులు పహారా కాస్తున్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ నిబంధనలను ఏపీ ప్రభుత్వం పాటించని పరిస్థితి నెలకొంది. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ పోలీసులు డ్యాం వద్దకు భారీగా చేరుకుంటున్నారు. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద యుద్ధ వాతావారణం నెలకొంది. రెండో రోజూ డ్యామ్ దగ్గర పోలీసుల పహారా కొనసాగుతోంది. తెలంగాణ, ఏపీ పోలీసులు ఢీ అంటే ఢీ అంటున్నారు. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యామ్ పై పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. డ్యామ్‌కు ఇరువైపులా వందలాది మంది పోలీసుల మోహరింపుతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
శుక్రవారం ఐజీ స్థాయి అధికారులు సాగర్ చేరుకొని పరిస్థితి అంచనా వేసే అవకాశాలు ఉన్నాయి. నీటి పారుదల ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ నాగార్జునసాగర్ కు చేరుకోబోతున్నారు. ఇప్పటికే సుమారు 2వేల క్యూసెక్కుల నీరు ఏపీకి దౌర్జన్యంగా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ నీటి మట్టం 523 అడుగుల చేరువలో ఉంది. మరో 12 అడుగులకు చేరితే డెడ్ స్టోరోజికి చేరే అవకాశం ఉంది. నిన్నటి నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. దీంతో హైదరాబాద్ లో తాగునీటి సమస్య ఏర్పడే అవకాశం ఉందని నీటిపారుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. చర్చలు సఫలమైతాయ, విఫలమైతాయ వేచి చూడాల్సిన అవసరం ఉన్నది.