డి మార్ట్‌లో ఆకస్మిక తనిఖీలు.. 20 కేజీల టీ పౌడర్ సీజ్

నిత్యం ప్రజలు నమ్మే డి మార్ట్ లో కల్తీ ఆహార పదార్థాలు ఉన్నట్లు

Update: 2024-09-25 15:06 GMT

దిశ,సూర్యాపేట : నిత్యం ప్రజలు నమ్మే డి మార్ట్ లో కల్తీ ఆహార పదార్థాలు ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఆ పదార్థాల శాంపిల్స్ ను ఆహార పదార్థాల ప్రయోగశాలకి పంపిస్తున్నట్టు వారు పేర్కొన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని డి మార్ట్ ని జోనల్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి,జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆర్.కిరణ్ కుమార్ లు ఆకస్మికంగా తనిఖీ చేసి పలు అనుమానిత ఆహార పదార్థాల షాంపిల్స్ లను సేకరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన ఆహార పదార్థాల్లో కల్తీ కలిసినట్లు నిరూపణ అయితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.

పలు షాపుల్లో అనుమానించిన ఆహార ప్రయోగశాలకు పంపిస్తున్నట్లు తెలిపారు.ప్రజలు నమ్మే డి మార్ట్ లో విడిగా అమ్ముతున్న టీ పౌడర్ తో కల్తీ ఉన్నట్లు అనుమానించి శాంపిల్స్ తీసుకుని ల్యాబ్ కు పంపిస్తున్నట్లు చెప్పారు. ప్రయోగశాల నివేదికల ఆధారంగా వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆహార పదార్థాలలో రంగులు, హానికరమైన కెమికల్స్ ను ఉపయోగించరాదని,ఆ నిబందనలను అతిక్రమించిన యాజమాన్యాలకు చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.అంతేకాక వివిధ వ్యాపారులకు లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే క్రిమినల్ చర్యలు తప్పవని,ప్రతి ఒక్క ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ తప్పనిసరిగా లైసెన్స్ పొందాలని సూచించారు.నాణ్యత లేని, శుభ్రత పాటించని పలు దుకాణాల వారికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్ట ప్రకారం షెడ్యూల్ 4 కింద చర్యలు తీసుకుంటామని తెలిపారు.


Similar News