తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగం మరువలేనిది : మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎస్.వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సమైక్యతా దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు.
దిశ, సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎస్.వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సమైక్యతా దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. అంతకు ముందు మంత్రి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, సాయుధ పోరాట యోధులకు నివాళులర్పించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ భూస్వామ్య వ్యవస్థను, రాచరికపు వ్యవస్థను రూపుమాపి అమరులైన పోరాట యోధుల వీరత్వాన్ని మంత్రి జగదీష్ కొనియాడారు.
చాకలి ఐలమ్మ చైతన్యంతో మొదలై దొడ్డి కొమురయ్య అమరత్వంతో తిరుగుబాటు ఉవ్వెత్తున సాయుధ పోరాటం చరిత్రలో నిలిచిందన్నారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలను తిలకించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగేందర్ రావు, అదనపు కలెక్టర్లు వెంకట్ రెడ్డి, ప్రియాంక, వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ మున్సిపల్ ఛైర్మన్ లు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.