మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి.. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

Update: 2022-02-05 12:54 GMT

దిశ, సూర్యాపేట: విద్యుత్ శాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. ఆయన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో అవినీతి జరిగిందని, ఆధారాలతో నిరూపిస్తానని అన్నారు. ఆత్మకూర్ ఎస్ మండలం, పెన్ పహాడ్ మండల పరిధిలోని లింగాల గ్రామంలో బినామీ పేరు మీద ఐకేపీ కేంద్రం నిర్వహించిన టీఆర్ఎస్ నాయకురాలు, మిల్లర్లు కలిసి 134 మంది భూమిలేని, కౌలు కూడా చెయ్యని వ్యక్తులపై సుమారు రెండు కోట్లకు పైగా అవినీతికి తెరలేపారని ఆయన పేర్కొన్నారు.

అవినీతి అంతా రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావు, డి ఆర్ డి ఏ పిడి కిరణ్ కుమార్ కనుసన్నల్లోనే జరిగిందని, ఈ అవినీతికి బాధ్యత వహిస్తూ మంత్రి జగదీష్ రెడ్డిని ప్రభుత్వం తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సంబంధిత జిల్లా కలెక్టర్‌ని, అధికార యంత్రాంగాన్ని,సెలవు పెట్టి ఇంట్లో కూర్చోమని ఆయన అన్నారు.

ఈ విషయంపై సిట్టింగ్ జడ్జితో, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాబోయే శాసనసభ సమావేశంలో ఈ ఐకేపీ కేంద్రాల్లో జరిగిన అవినీతి పై బీజేపీ ఎమ్మెల్యేలు  ప్రస్తావిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు అబిద్, సలిగంటి వీరేంద్ర, చల్లమల్ల నర్సింహా, పల్స మల్సూర్ గౌడ్, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News