స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరైన ఎంపీ

Update: 2024-10-07 12:27 GMT

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : ఢిల్లీలోని పార్లమెంట్ హల్ లో సోమవారం జరిగిన మొదటి స్టాండింగ్ కమిటీ సమావేశానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ, హైదరాబాదులోని ట్రాఫిక్ సమస్యతో పాటు.. వరంగల్, కరీంనగర్ నగరాల సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ,మున్సిపాలిటీలు కార్పొరేషన్లుగా మారాయన్నారు. లేఔట్లు రెగ్యులరైజ్ కాకపోవడం వల్ల మౌలిక సదుపాయాల లోపం తో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరన్నారు. ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంతో పాటు.. హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. గత 10 సంవత్సరాలలో భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా.. మంజూరు చేయాల్సిన 118.64 లక్షల ఇండ్లలో, కేవలం 1.58 లక్షల ఇళ్లను మాత్రమే మంజూరు చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ 21.37 లక్షలు, ఉత్తరప్రదేశ్ 17.76 లక్షలు,మహారాష్ట్ర 13.64 లక్షలు, గుజరాత్ 13.64 లక్షల ఇండ్లు మంజూరు చేశారన్నారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం లేక రాష్ట్రానికి కేటాయించిన వాటి కోసం పోరాడడంలో విఫలమైందన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో..అర్హులైన పేద ప్రజల డేటాను సేకరించమన్నారు. దాదాపు 33.88 లక్షల ఇండ్లు అవసరం కాగా..వచ్చే 5 ఏళ్లలో కోటి ఇండ్లను పూర్తి చేయాలని భారత ప్రభుత్వం యోచిస్తోందని, ఈ ఏడాది 6 లక్షల ఇండ్లను కేటాయించాలని కోరారు.హదరాబాద్ నగరం దాదాపు 50 కి.మీ చుట్టూ విస్తరించడంతో.. ప్రజా రవాణా లేక కనెక్టివిటీ లేకపోవడం, నిరుద్యోగం, ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటుందన్నారు. ఈ విషయంలో రాష్ట్రాలను సమీక్షించి, మద్దతు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి నగరాల చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామ పంచాయతీలు పట్టణీకరణగా మారుస్తూ.. మున్సిపాలిటీలుగా మారాయని, కానీ అనధికారిక లెఔట్స్ వలన సరైన రోడ్లు, నీటి సరఫరా, మురుగునీరు వ్యవస్థ సరిగా లేవన్నారు. ఈ క్రమంలో తమ కమిటీ సమావేశాలను విజయవంతం చేయడానికి, వచ్చే 5 సంవత్సరాలలో పట్టణీకరణ జరగాలని కోరారు.


Similar News