తెలంగాణకు 1.8 లక్షలు కేంద్రం ఇండ్లు.. వేరే రాష్ట్రాలకు 20 లక్షలు : చామల కిరణ్

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు 15 నుంచి 20 లక్షల ఇండ్లను మంజూరు చేస్తే.. తెలంగాణకు 1.8 లక్షల ఇండ్లు మంజూరు చేసిందని భువనగిరి ఎంపీ వెల్లడించారు.

Update: 2024-10-07 12:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు 15 నుంచి 20 లక్షల ఇండ్లను మంజూరు చేస్తే.. తెలంగాణకు 1.8 లక్షల ఇండ్లు మంజూరు చేసిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఎక్స్ వేదికగా ఒక వీడియో విడుదల చేశారు. సోమవారం హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ పార్లమెంట్‌లో జరిగిందని తెలిపారు. తాను ప్రధాన మంత్రి ఆవాస్ యోజనపై సమావేశం తాను చర్చ చేసినట్లు పేర్కొన్నారు. గత పదేళ్లలో తెలంగాణకు మాత్రం గత పదేళ్లలో కేవలం లక్షా ఎనభై వేల ఇళ్లను మాత్రమే మంజూరు చేసిందని స్పష్టం చేశారు. రానున్న ఐదేళ్లలో కోటి ఇళ్లను మంజూరు చేయాలని లక్ష్యం కేంద్ర ప్రభుత్వం పెట్టుకుందన్నారు.

ప్రజాపాలనలో భాగంగా తెలంగాణలో నిరుపేదలకు 33 లక్షల ఇల్లు అవసరం ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఇందుకుగాను ఈ ఏడాది ఆరు లక్షల ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయాల్సిందిగా కోరడం జరిగిందన్నారు. అలాగే మెట్రో రైల్ విస్తీరణ కార్యక్రమానికి సహకరించాలని కోరినట్లు తెలిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీలు అన్ని కూడా మున్సిపాలిటీలు అయ్యాయని, కానీ డ్రైనేజీ సిస్టమ్, కనెక్టివిటీ సిస్టమ్ లేదని, దీనికి భారీ బడ్జెట్ కేటాయించాలని తెలిపారు. ఆ ప్రాంతాలు అర్బనైజేషన్ అయ్యాయని, కానీ వారి స్థితిగతులు మాత్రం మారలేదన్నారు. ఇబ్రహీమ్ పట్నం లాంటి ప్రాంతాలు నగరం చుట్టుపక్కల ఉన్నాయని తెలిపారు. హౌసింగ్ కమిటీలో తాను తెలంగాణ నుంచి ఒక్కరే ఉన్నారని, అన్ని అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిపినట్లు వెల్లడించారు. ఈ అంశాలపై కమిటీ చైర్మన్ సానుకూలంగా స్పందించారని చెప్పుకొచ్చారు.


Similar News