భవిష్యత్తు ఎర్రజెండాదే.. పోతినేని సుదర్శన్
ప్రపంచంలో అనేక దేశాల్లో పాలక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి కమ్యూనిస్టులను అధికారంలోకి తీసుకొస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్ లు అన్నారు.
దిశ, చౌటుప్పల్ టౌన్ : ప్రపంచంలో అనేక దేశాల్లో పాలక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి కమ్యూనిస్టులను అధికారంలోకి తీసుకొస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్ లు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఎస్ఎం రెడ్డి ఫంక్షన్ హాల్ లో మంగళవారం నిర్వహించిన సీపీఎం మూడో జిల్లా ముగింపు మహాసభకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పక్కనున్న శ్రీలంకలో, నేపాల్ లో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారని ఫ్రాన్స్ పార్లమెంటు ఎన్నికల్లో పెద్ద పార్టీగా అవతరించిందని తెలిపారు. జర్మనీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కమ్యూనిస్టులు గెలిచారని అన్నారు.
అమెరికా చుట్టూ ఉన్న వెనిజులా, అర్జెంటీనా లాంటి దేశాల్లో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారన్నారు. ప్రపంచ దేశాల పై పెత్తనం చెలాయిస్తూ తన సంక్షేమాన్ని ఇతర దేశాలపై రుద్దుతూ పూట గడుపుతుందన్నారు. దాన్ని అంటగాగుతున్న భారతదేశం అమెరికా కనుసన్ననల్లో కొనసాగిస్తోందని ఆరోపించారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేసి అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేసి ప్రారంభించినా మొన్న జరిగిన ఎన్నికల్లో అక్కడి ప్రజలు బీజేపీని ఓడించారన్నారు. మోదీ అనుసరిస్తున్న విభజన రాజకీయాలను తిప్పికొడుతూ వర్గ ఉద్యమాల్ని పెంచాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. ఒక్క ఫ్రీ బస్సు తప్ప మిగతా ఏ ఒక్క గ్యారెంటీని అమలు చేయలేదన్నారు. రైతు రుణమాఫీ, పెన్షన్ల రెట్టింపు, ప్రతి మహిళకు రూ. 2500 లు, కల్యాణ లక్ష్మి తులం బంగారం లాంటి వాటిని అమలు చేయలేదన్నారు.
ఈ మహాసభల్లో జిల్లా కార్యదర్శి ఎండీ జాంగిర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, పైల్ల ఆశయ్య, సీనియర్ నాయకులు బొంతల చంద్రారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నర్సింలు, మాటూరు బాలరాజు, కల్లూరు మల్లేశం, దోనూరు నర్సిరెడ్డి, దాసరి పాండు, మేక అశోక్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, ఎండీ పాషా, మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, పట్టణ కార్యదర్శి గోశిక కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.