నిర్లక్ష్యానికి నిలువుటద్దం.. ఈ గుంతలు

భువనగిరి పట్టణంలోని అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యానికి నిలువటద్దం పట్టేలా జగదేవపూర్ రోడ్డులో గుంతలు ఏర్పడ్డాయి.

Update: 2024-12-17 13:18 GMT

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : భువనగిరి పట్టణంలోని అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యానికి నిలువటద్దం పట్టేలా జగదేవపూర్ రోడ్డులో గుంతలు ఏర్పడ్డాయి. కొన్ని నెలలుగా ఈ రోడ్డులో అతి ప్రమాదకర స్థాయిలో ఈ గుంతలు ఏర్పడినా కూడ వాటిని పట్టించుకునే పాపాన పోవటం లేదు. నిత్యం ఈ రహదారి పై భారీ వాహనాలు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు ఇలా వందల సంఖ్యలో ప్రయాణం చేస్తుంటాయి. ఈ గుంతల వద్దకు రాగానే వాహనాలు సడెన్ బ్రేక్ వేస్తుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

ఈ రోడ్డు మీదుగా ప్రతిరోజు ప్రజాప్రతినిధులు, అధికారులు తిరుగుతూనే ఉంటారు. సంబంధిత శాఖ అధికారులకు మాత్రం ఈ గుంతల సమస్యలు పట్టకపోవడం గమనార్హం. గుంతలే ప్రమాదకరంగా మారితే ఇంకా వాటిలో కొన్ని రాళ్లు వేసి ప్రమాద స్థాయిని మరింతగా పెంచారు. ఇప్పటికైనా ఈ గుంతలను పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు.


Similar News