సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.. డీఎంహెచ్ఓ
వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని లేనిచో శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని నల్గొండ డీఎంహెచ్వో డాక్టర్ పుట్ల శ్రీనివాస్ హెచ్చరించారు.
దిశ, మర్రిగూడ : వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని లేనిచో శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని నల్గొండ డీఎంహెచ్వో డాక్టర్ పుట్ల శ్రీనివాస్ హెచ్చరించారు. మంగళవారం స్థానిక పీఎస్సీ ఆసుపత్రిలో ఫ్లోరోసిస్ మహమ్మారి పై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇంటింటా సర్వేలో భాగంగా ఫ్లోరోసిస్ బాధ్యులను గుర్తించి నివేదిక అందజేయాలని సూచించారు. అలాగే నూతనంగా ఏర్పాటైన డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించారు. ఆసుపత్రి ఫార్మసీలో రోగుల కోసం ఉన్న మందులను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. విధుల పట్ల సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపైన తగిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఆయన వెంట అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, చండూరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, పీఓడీడీటీ డాక్టర్ కృష్ణకుమారి, హాస్పిటల్ సూపరిండెంట్ శంకర్ నాయక్, డాక్టర్లు, వైద్య సిబ్బంది ఉన్నారు.