సంక్షేమ పథకాల అమలులో ఉద్యోగుల పాత్ర కీలకం: మంత్రి జగదీష్ రెడ్డి
సంక్షేమ పథకాల అమలులో ఉద్యోగుల పాత్ర కీలకమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం నల్గొండలో పట్టణంలోని టీఎన్జీవో డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు.
దిశ, నల్లగొండ: సంక్షేమ పథకాల అమలులో ఉద్యోగుల పాత్ర కీలకమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం నల్గొండలో పట్టణంలోని టీఎన్జీవో డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. విధి, విధానాలతో పాటు నిధులు విడుదల చేసేది ప్రభుత్వమే అయినప్పటికీ.. ఆచరణలో అమలు పరిచేది ప్రభుత్వ ఉద్యోగులేనని స్పష్టం చేశారు.
కేసీఆర్ నేతృత్వంలో నేడు తెలంగాణ యావత్ భారతదేశానికి రోల్ మోడల్ గా నిలిచిందంటే అందులో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమని ప్రశంసించారు. అదేవిధంగా అంగన్ వాడీ టీచర్స్ అసోసియేషన్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ను మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు.అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల మదిలో తెలంగాణ పదాన్ని ఒక శ్వాసగా మార్చిన టీఎన్జీవో సంఘాన్ని ఆయన కొనియాడారు. తన అనునయులకు ప్రభుత్వ సొమ్ము రూ.19 లక్షల కోట్లు ధారాదత్తం చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు.
రుణమాఫీ పథకం కింద రూ.26వేల కోట్లు, రైతుబంధు పథకం కింద రూ.60వేల కోట్లు, ఆసరా ఫించన్ల కింద రూ15వేల కోట్లు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అందిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఓర్చుకోలేక పోతుందన్నారు. అది కేంద్రానికి కంటగింపుగా మారి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు మంజూరు చెయ్యకుండా మోకాలడ్డుతోందంటూ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి కాంచనపల్లి కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.