సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి..

మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే వేముల వీరేశంకు ఆదివారం సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు వినతిపత్రం అందజేశారు.

Update: 2024-12-29 11:10 GMT

దిశ, చిట్యాల : మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే వేముల వీరేశంకు ఆదివారం సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకుడు జిట్ట నగేష్ మాట్లాడుతూ నూతన పీఆర్సీలో భాగంగా కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇచ్చి అర్హులైన కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు జడల నరసింహ, పాల లక్ష్మయ్య, బాకీ అండాలు, మేడి శేఖర్, నల్ల శంకర్, మేడి శోభ, పద్మ, యమునా ధనలక్ష్మి మల్లేష్, శ్రీకాంత్, దుర్గేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.


Similar News