మహిళ మెడలో నుంచి పుస్తెలతాడు చోరీ...

పొలానికి వెళ్లి నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న మహిళ మెడలో నుంచి మోటార్ బైక్ పై ఇరువురు యువకులు వచ్చి పుస్తెలతాడు లాక్కెళ్ళిన సంఘటన చింతపల్లి మండలం లో బుధవారం చోటు చేసుకుంది.

Update: 2024-06-26 16:07 GMT

దిశ,చింతపల్లి : పొలానికి వెళ్లి నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న మహిళ మెడలో నుంచి మోటార్ బైక్ పై ఇరువురు యువకులు వచ్చి పుస్తెలతాడు లాక్కెళ్ళిన సంఘటన చింతపల్లి మండలం లో బుధవారం చోటు చేసుకుంది. బాధితురాలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని కురుమేడు గ్రామానికి చెందిన గోరేటి బక్కమ్మ భర్త నరసింహ 60 సంవత్సరాల మహిళ కురుమేడు గ్రామ శివారులోని విరాట్ నగర్ కాలనీ వద్దగల తన వ్యవసాయ పొలం నుంచి ఇంటికి చేరుకునేందుకు హైదరాబాదు నాగార్జున సాగర్ రహదారి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుంది.

ఇదే అదునుగా భావించిన విరాట్ నగర్ కాలనీ సమీపంలో ఇరువురు యువకులు మోటర్ బైక్ పై వస్తూ ఆమె వద్ద బైకు ఆపి ఇది ఏ ఊరు పెద్దమ్మ అని అడుగుతూ ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు పుస్తెల తాడును మెడలో నుంచి లాక్కుని పారిపోయారు. వెంటనే విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి నాంపల్లి సీఐ నవీన్ కుమార్, ఎస్సై బి యాదయ్య లు చేరుకొని బాధితురాలు నుంచి వివరాలు సేకరించారు. పక్కనే ఉన్న ఇంటిలో సీసీ ఫుటేజ్ లు కూడా పరిశీలించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ బి యాదయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News