పోలీస్ స్టేషన్ అంటే మన బాధలను తీర్చే కేంద్రం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలో పోలీసు

Update: 2024-10-21 07:38 GMT

దిశ,నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు.పోలీసుల కవాతు తో గౌరవ వందనం స్వీకరించి అధికారిక లాంఛనాలతో అమరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి,సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఎస్పీ.శరత్ చంద్ర పవార్ పాల్గొన్నారు.ఆర్ అండ్ బి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ పోలీసుల త్యాగాలను గుర్తుచేసుకుంటు అమరుల అందరికీ నా సెల్యూట్ అన్నారు.సమాజం కోసం అమరుల కుటుంబాలకు నా సానుభూతి తెలుపుతూ ఉన్నాను.సమాజంలో లో వారి మార్కు ప్రత్యేక మైనది అన్నారు.పోలీస్ స్టేషన్ అంటే మన బాధలను తీర్చే కేంద్రం అన్నారు.

నా ముప్పై ఏండ్ల రాజకీయ జీవితంలో పోలీసులతో వారి కుటుంబాలకు నా తరుపున కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ తరపున రూ. 25 వేలు ఆర్థిక సహాయం అందిస్తానని తెలిపారు. ఏ అర్ధ రాత్రి అయిన క్షణం తీరిక లేకుండా ప్రజల కోసం పని చేసే వారు పోలీసులు అన్నారు.అమరుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ అమరుల కుటుంబాలకు మేము అండగా ఉంటాం అని అన్నారు.వారి త్యాగాలను స్మరించుకుంటూ.. వారి త్యాగం వెలకట్టలేనిది అన్నారు.ఎస్పీ.శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ అహర్నిశలు ప్రజల సంక్షేమం కోసం పోలీసులు సేవ చేయడానికి ప్రజలకు రక్షణగా ఉన్నామని ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ లో తెలుపాలని అసాంఘిక కార్యక్రమాలకు ఎవరు పాల్పడవద్దు అని అన్నారు.అమరవీరుల అయిన 15 మంది కుటుంబాలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున గిఫ్ట్ లు అందజేశారు.


Similar News