గాయత్రి పవర్ ప్లాంట్‌లోకి చేరిన భారీగా చేరిన వరదనీరు.. ప్లాంట్‌లో చిక్కుకున్న ఆరుగురు

సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని రాఘవాపురం నుండి మీగడం పహాడ్ తండా గ్రామాల శివారులో జాన్‌పహడ్ నుండి మఠంపల్లికి వెళ్లే ప్రధాన రహదారి వెళ్లే రోడ్డులో ఉన్న వేములేరు వాగు ఉంది.

Update: 2024-09-01 04:32 GMT

దిశ, నేరేడుచర్ల (పాలకవీడు): సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని రాఘవాపురం నుండి మీగడం పహాడ్ తండా గ్రామాల శివారులో జాన్‌పహడ్ నుండి మఠంపల్లికి వెళ్లే ప్రధాన రహదారి వెళ్లే రోడ్డులో ఉన్న వేములేరు వాగు ఉంది. అయితే ఈ వాగుపై గతంలో విద్యుత్ తయారీ కోసం గాయత్రి పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంతో వరద నీరు భారీ ఎత్తున దిగువకు చేరుతుంది. శనివారం రాత్రి ఆ పవర్ ప్లాంట్‌లోకి వరద నీరు భారీగా చేరింది. ఆ సమయంలో అందులో ఉన్న ఆరుగురు ఉద్యోగులు వరద నీటిలో చిక్కుకున్నారు. దీంతో వారు పాలకవీడు మండల పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే పాలకవీడు ఎస్సై లక్ష్మీ నరసయ్య తన సిబ్బందితో JCB తీసుకొచ్చి అక్కడ అడ్డుగా ఉన్న విద్యుత్ వైర్లను తొలగించి తెల్లవారు జామున 3 గంటల నుంచి 5 గంటల వరకు రాత్రి రెండు గంటల పాటు శ్రమించి అందులో ఉన్న ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇలా రిస్క్ ఆపరేషన్ చేసి వరదల్లో చిక్కుకున్న ఆరుగురిని బయటకు తీసుకు వచ్చిన ఎస్సై లక్ష్మీ నరసయ్య తో పాటు కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు అజీముద్దీన్ హోంగార్డ్ లక్ష్మణ్ తో పాటు ఈ విషయం తెలుసుకున్న అక్కడి చేరుకొని పలు సూచనలు అందించిన ఎంపీడీవో లక్ష్మిని స్థానిక ప్రజలతో పాటు పలువురు అభినందించారు.


Similar News