disha effect :దిశ ఎఫెక్ట్..డీటీఆర్ లపై విచారణ ప్రారంభించిన ఏడీఈ
దిశ దినపత్రికలో సోమవారం "అడ్డగోలుగా..... అవసరం లేకున్నా డీ.టీ.ఆర్ ల ఏర్పాటు" " అనే కథనానికి స్పందించిన ఆలేరు ఏ.డి.ఈ రాజశేఖర్ విచారణ ప్రారంభించారు.
దిశ ఆలేరు :
దిశ దినపత్రికలో సోమవారం "అడ్డగోలుగా..... అవసరం లేకున్నా డీ.టీ.ఆర్ ల ఏర్పాటు" " అనే కథనానికి స్పందించిన ఆలేరు ఏ.డి.ఈ రాజశేఖర్ విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగా మోటకొండూరు మండలం దిలావర్ పూర్ గ్రామ పరిధిలో డీ.టీ.ఆర్ ఏర్పాటుచేసి నిరుపయోగంగా వున్నా విషయమై సోమవారం దిశ దినపత్రికలో వచ్చింది. ఏ.డీ ఈ,రాజశేఖర్, మోటకొండూరు మండల ఏఈ వినోద్ లు డీటీఆర్ వద్దకు వెళ్లి పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ విషయమై నివేదికలు తయారుచేసి ఉన్నత అధికారులకు పంపేందుకు సిద్ధం చేస్తామన్నారు.
విద్యుత్ శాఖలో బంధుప్రీతి..
యాదాద్రి,భువనగిరి జిల్లాలోని యాదగిరి గుట్టలో తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ యాదగిరి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం, ఆలేరు మండలంలో అతి ప్రాచీనమైన శ్రీ సోమేశ్వర ఆలయం,జైన దేవాలయం ఉండడంతో.. ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం గత దశాబ్దకాలం నుంచి ఊపందుకుంది. ఈ ప్రాంతాల్లో పెట్టుబడి పెడితే ..పెట్టిన పెట్టుబడి ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో విద్యుత్ శాఖ రాష్ట్ర స్థాయి, ఇతర జిల్లా అధికారులు, మండలాల విద్యుత్ శాఖ అధికారులు, వారి బంధువులు ఈ ప్రాంతాలలో భూములు కొనుగోలు చేశారు. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో, వివిధ మండలాలలో గతంలో విధులు నిర్వహించిన విద్యుత్ శాఖ అధికారులు, వారికీ చెందిన , వారి వారి కుటుంబ సభ్యులు, బంధువులు సైతం ఈ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశారు. వీరు కొనుగోలు చేసిన వ్యవసాయ భూముల ప్రాంతంలో బోరు బావులకు సరఫరా అయ్యే విద్యుత్తులో అధిక లోడు లేనప్పటికీ. యాదాద్రి భువనగిరి జిల్లా విద్యుత్ శాఖ అధికారులు రాష్ట్ర స్థాయి,ఇతర జిల్లాల కు చెందిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల,వారి బంధువుల మెప్పు పొందడం కోసం విచ్చలవిడిగా 25కేవీ 63కేవీ డీ టీ ఆర్ లు ఆమర్చినట్లు చేసినట్లు సమాచారం. దీంతో వీరి బంధుప్రీతి, రాష్ట్ర,ఇతర జిల్లాలకు సంబంధించిన పై అధికారుల మెప్పు పొందడం కోసం సంస్థకు భారీగా నష్టం చేసినట్టు.. దిశ పరిశీలనలో తేలింది. ఈ బంధుప్రీతి అవినీతి బాగోతం పై విచారణ సంస్థ( విజిలెన్స్)అధికారులు లోతుగా విచారిస్తే విద్యుత్ శాఖ అధికారులు సంస్థకు ఏ మేర నష్టం చేశారో వాస్తవాలు వెలుగు లోకి వస్తాయని ఈ ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు.
వాస్తవాలు కప్పి పుచ్చుతున్న ఉద్యోగులు
వ్యవసాయ బోరు బావుల విద్యుత్ సరఫరా కోసం ఆ ప్రాంతంలో డీ. టీ. ఆర్ లు ఏర్పాటు చేయాలంటే ఆ ప్రాంతంలో అధికలోడు ఉండాలి. అదేవిధంగా ప్రస్తుతం విద్యుత్ కనెక్షన్ కోసం మూడు నుంచి నాలుగు వ్యవసాయ బోరు బావులైన ఉండాలి..అప్పుడు మాత్రమే అదనంగా 25 కేవీ డీ టీ ఆర్ ను ఏర్పాటు చేసి.. రైతుల బోర్లను వినియోగలోకి తేవాలి. అధికారులు మాత్రం ఆ ప్రాంతంలో ఒకే ఒక్క బోరున్నప్పటికీ నాలుగు బోరు బావులు ఉన్నట్లుగా విద్యుత్ శాఖ అధికారుల, వారి బంధువుల ద్వారా 3నుంచి 4 డీడీలు తీయించి. వాటికీ సర్వీస్ నెంబర్ లు కేటాయిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో నాలుగు బోరు బావులు ఉన్నాయని సంస్థకు వాస్తవాలు కప్పిపుచ్చి ఆ ప్రాంతంలో అధికలోడు లేనప్పటికీ ఒకే ఒక్క బోరుబావికి కూడా ప్రత్యేకంగా డీ టీ ఆర్ ల ను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో సంస్థ మరింత నష్టాల్లోకి పోయేందుకు అధికారులే కారణం అవుతున్నారు!