50 ఏండ్లు నిండిన గీత కార్మికులకు పింఛన్లు మంజూరు చేయాలి

50 ఏండ్లు నిండిన ప్రతి గీతకార్మికునికి పింఛన్ మంజూరు చేయాలని గీతపనివారల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎర్ర రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు.

Update: 2024-12-24 10:07 GMT

దిశ,రామన్నపేట : 50 ఏండ్లు నిండిన ప్రతి గీతకార్మికునికి పింఛన్ మంజూరు చేయాలని గీతపనివారల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎర్ర రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో జరిగిన గీతపనివారల సంఘం మండల కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గీతపనివారలు తాటిచెట్లు ఎక్కుతూ జీవనోపాధి పొందుతున్నారని, తద్వారా వారి శరీరం, ఎముకలు ధృడత్వాన్ని కోల్పోయి 50 ఏండ్ల లోపే ఎటూ చేతగాని స్థితికి వెళుతున్నారని అన్నారు. 50 ఏండ్లు నిండిన గీత కార్మికులు మండలంలో దాదాపు 200 మంది ఉన్నారని, వారికి ఫించను వెంటనే మంజూరు చేయాలన్నారు. అదే విధంగా గీతపనివారల కార్మికుడు తాటిచెట్టుపై నుండి పడి ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి అండగా ఉండి ఫించన్ ను వెంటనే పునరిద్దరించాలని అన్నారు. ఈ సమావేశంలో గీతపనివారల మండల అధ్యక్షులు గంగాపురం వెంకటయ్య, గీతపనివారల సీనియర్ నాయకులు బాలగోని మల్లయ్య, కొమ్మాయిగూడెం గౌడసంఘం అధ్యక్షులు ఎర్ర వెంకటేశం, గీతపనివారల నాయకులు భూపతి నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.


Similar News