వెంటనే బకాయిలు చెల్లించాలి

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస నగర్ సమీపంలో ఉన్న సంగం డెయిరీ వద్ద బుధవారం ఉద్రిక్త త పరిస్ధితి నెలకొంది.

Update: 2024-08-28 09:36 GMT

దిశ,మిర్యాలగూడ టౌన్ : నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస నగర్ సమీపంలో ఉన్న సంగం డెయిరీ వద్ద బుధవారం ఉద్రిక్త త పరిస్ధితి నెలకొంది. డెయిరీ కేంద్రం నిర్వాహకుల నుంచి బకాయిలు రావాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. దీంతో సంగం డెయిరీ కేంద్రం వద్ద రైతులు టెంట్ వేసుకొని నిరసన చేస్తూ ఆందోళనకు దిగారు. సంగం డెయిరీలో నేడు ప్రారంభోత్సవం ఉండటంతో రైతులు ముందుగానే అక్కడకు చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే గతంలో ఇక్కడ నిర్వహణలో ఉన్న వెంకటేశ్వర డెయిరీ కేంద్రం నిర్వాహకులు నష్టం పేరుతో అప్పులు అయ్యాయని ఎత్తివేశారు. బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో అధికారులు వేలం నిర్వహించారు. వేలంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన దూదిపాళ్ల నరేందర్ సంగం డెయిరీ యాజమాన్యం దక్కించుకుంది. ఈ సమయంలో వెంకటేశ్వర డెయిరీ వాళ్లకు రావాల్సిన బకాయిలు కూడా చెల్లిస్తామని ఒప్పుకున్నారు.

    కానీ ఇవ్వలేదు. దీంతో బుధవారం ప్రారంభోత్సవానికి సిద్ధం చేసుకోగా వెంకటేశ్వర డెయిరీ నిర్వాహకులు ,రైతులు కలిసి అడ్డుకున్నారు. దీనివలన సంగం డెయిరీ వద్ద ఉద్రిక్త త ఏర్పడింది. డెయిరీ లోనికి వెళ్లేందుకు రైతులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సంగం డెయిరీ నిర్వాహకులకు ,రైతులకి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటువేసుంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వెంకటేశ్వర డెయిరీ ఉన్నప్పుడు విక్రయించిన పాలకు డబ్బులు ఇవ్వకుండా ఎగవేశారని అన్నారు. బకాయిలు ఉన్న మొత్తం చెల్లించి ప్రారంభోత్సవం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

     పోలీసులు జోక్యం చేసుకున్నా ఆందోళన విరమించలేదు. సంగం డెయిరీ యాజమాన్యం రైతులతో చర్చలు జరుపుతునున్నట్లు తెలిసింది. వెంకటేశ్వర డెయిరీ నిర్వాహకులు సత్యనారాయణ మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకుంటామని చెప్పి మోసం చేస్తున్నారని ఆరోపించారు. బకాయిలు చెల్లిస్తామని మాట మార్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేసే వరకు సంగం డెయిరీ నిర్వహణ చేయవద్దని డిమాండ్ చేశారు.  

Tags:    

Similar News