crime news : ఆంధ్ర నుంచి తెలంగాణకు బెల్లం సరఫరా..

సారా తయారీ ఉపయోగించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ నుండి బెల్లం తీసుకొస్తుండగా సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడు వద్ద ఎక్సైజ్ పోలీసులు వాహనాలను పట్టుకుని ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి రెండు వాహనాలు సీజ్ చేసినట్లు హుజూర్ నగర్ ఎక్సైజ్ సీఐ జి.నాగార్జున రెడ్డి శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు.

Update: 2024-08-03 15:08 GMT

దిశ, హుజూర్ నగర్ : సారా తయారీ ఉపయోగించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ నుండి బెల్లం తీసుకొస్తుండగా సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడు వద్ద ఎక్సైజ్ పోలీసులు వాహనాలను పట్టుకుని ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి రెండు వాహనాలు సీజ్ చేసినట్లు హుజూర్ నగర్ ఎక్సైజ్ సీఐ జి.నాగార్జున రెడ్డి శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఎక్సైజ్ సీఐ నాగార్జున రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చింతలపాలెం మండలం ఎర్రకుంట తండాకి చెందిన ధీరవాత్ భానుప్రసాద్, వాంకుడోత్ నరేష్, గూగులోత్ రమేష్ అనే వ్యక్తులు ముఠాగా ఏర్పడి నందిగామ నుండి మటంపల్లి మండలం కొత్త తండాకు సారా తయారీకి బెల్లంను సరఫరా చేస్తున్నారని తెలిపారు.

భానుప్రసాద్ నరేష్ లు తన బజాజ్ ఆటో వాహనం సుమారు 350 కిలోల బెల్లంను తరలిస్తూ ఉండగా శుక్రవారం సాయంత్రం బెల్లంతో పాటు, 10 లీటర్ల సారాతో పాటు బజాజ్ ఆటోవాహనంను దొండపాడు వద్ద ఆ వాహనమును పట్టుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. అందులో నరేష్ అరెస్ట్ కాగా భానుప్రసాద్ రమేష్ పరారీలో ఉన్నారని వీటితో పాటు బెల్లం తీసుకుని మఠంపల్లి మండలంలోని కొత్తతండాలో సప్లై చేసేందుకు ప్రయత్నం చేస్తున్న ధీరావత్ నితిన్ నాయక్ అరెస్ట్ చేసి అతని వద్ద ఉన్న ద్విచక్ర వాహనం సీజ్ చేశామని చెప్పారు. వీరికి బెల్లం అమ్మిన ఎన్టీఆర్ జిల్లా నందిగామ వ్యాపారి పై కూడా కేసునమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడులలో ఎక్సైజ్ ఎస్సైలు దివ్య జగన్మోహన్ రెడ్డిలు, సిబ్బంది రవి రుక్మారెడ్డి, నాగయ్య, నాగరాజ్, సంజయ్, నవీన్, మణికంఠ పాల్గొన్నారు.

Tags:    

Similar News