వారి మృతి విద్యుత్ శాఖ, ప్రభుత్వ హత్యలే : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Update: 2023-09-14 15:18 GMT

దిశ వలిగొండ: నాగారం గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన (భార్యాభర్తలు బండ అంజయ్య, జంగమ్మల) విద్యుత్ శాఖ, ప్రభుత్వం చేసిన హత్యలే అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. గురువారం గ్రామంలో జరిగిన బండ అంజయ్య, జంగమ్మల అంత్యక్రియలో ఆయన పాల్గొన్నారు. ఫోన్‌లో విద్యుత్ అధికారులతో మాట్లాడి బాధ్యులైన ఎస్సీ, డీఈలను వెంటనే సస్పెండ్ చేసి.. మృతుల కుమారునికి ఇంజనీరింగ్ఉద్యోగం, ఎక్స్ గ్రెసియా వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర విద్యుత్ శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. వారి కుటుంబానికి భరోసాగా లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు.


20 మంది ఐఏఎస్ అధికారులు ఉండగా రిటైర్డ్ అయిన వారిని సీఎండీ లుగా పెట్టుకొని దోపిడీకి పాల్పడుతున్నారు, వారు ఎక్కడ సంతకం చెయ్ అంటే అక్కడ చేస్తారు. యువ ఐపీఎస్ లు అయితే దోపిడికి సంతకాలు చేయరని వారికి పోస్టింగులు ఇవ్వకుండా దోపిడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ఆడెం సంజీవరెడ్డి, భువనగిరి నియోజకవర్గం ఇంచార్జ్ పంజాల రామాంజనేయులు గౌడ్, స్థానిక సర్పంచ్ తీగల క్రిష్టయ్య. ఎంపిటిసి బెలిదే సునీత నాగేశ్వర్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, తుమ్మల యుగంధర్ రెడ్డి, బడుగు సత్యనారాయణ, కందాల రామకృష్ణారెడ్డి, వేములకొండ ఎంపీటీసీ సామ రాంరెడ్డి, పబ్బు శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


Similar News