డీఎస్సీ2024: సెలెక్ట్ అయిన అభ్యర్థులు వెంటనే ఇలా చేయండి:విద్యాశాఖాధికారి

డీఎస్సీ-2024లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు పొందిన అపాయింట్మెంట్ కాపీ జిరాక్స్ దరఖాస్తును..ఈనెల 11న జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సమర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి కె.అశోక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2024-10-10 14:21 GMT

దిశ , సూర్యాపేట :డీఎస్సీ-2024లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు పొందిన అపాయింట్మెంట్ కాపీ జిరాక్స్ దరఖాస్తును..ఈనెల 11న జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సమర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి కె.అశోక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్కూల్ అసిస్టెంట్స్, సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్జీటీ -తత్సమాన)పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులందరూ నూతన కలెక్టరేట్ లోని రెండవ అంతస్తులో రూం నంబర్ ఎస్ 26 లో కాపీలను అందజేయాలని తెలిపారు.


Similar News