గురుద్వారాను సందర్శించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం రాత్రి నాందేడ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు
దిశ, హుజూర్ నగర్ : మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం రాత్రి నాందేడ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం నాందేడ్ లోని 400 సంవత్సరాల చరిత్ర గల పురాతన సిక్కు దేవాలయమైన గురుద్వారాను జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ కలిసి సందర్శించారు. వారికి అక్కడి నాయకులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సిక్కుల చివరి గురువు అయిన గురుగోవింద్ సింగ్ ఈ ప్రాంతంలో మరణించారని, దీంతో సిక్కులను దీనిని అత్యంత పవిత్రమైన ప్రాంతంగా భావిస్తారని, గురుద్వారాను మహారాజా రంజిత్ సింగ్ నిర్మించారని తెలిపారు.