అసైన్డ్ భూమిలో కమర్షియల్ నిర్మాణాలు చట్టరిత్యా నేరం : తహశీల్దార్ క్రిష్ణారెడ్డి
అసైన్డ్ భూమిని అమ్ముట, కొనుట, ఇతర కమర్షియల్ నిర్మాణ కట్టడాలు చేపట్టినా చట్టరీత్యా నేరమని మునుగోడు తహశీల్దార్ కృష్ణారెడ్డి అన్నారు.
దిశ, మునుగోడు : అసైన్డ్ భూమిని అమ్ముట, కొనుట, ఇతర కమర్షియల్ నిర్మాణ కట్టడాలు చేపట్టినా చట్టరీత్యా నేరమని మునుగోడు తహశీల్దార్ కృష్ణారెడ్డి అన్నారు. శనివారం దిశ దినపత్రికలో ప్రచురించిన 'ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు' అనే కథనం పై స్పందించిన మునుగోడు తహశీల్దార్ క్రిష్ణారెడ్డి అక్రమ నిర్మాణ కట్టడాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మునుగోడు గ్రామ శివారులోని సర్వేనెంబర్ 78లో నిరుపేద రైతులకు వ్యవసాయం సాగు చేసుకునేందుకు మాత్రమే ప్రభుత్వం వారికి కేటాయించిందన్నారు.
అసైన్డ్ నిబంధనలు ఉల్లంఘించి వ్యవసాయ భూములను వ్యవసాయతర పనులకు వినియోగించినట్లయితే ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు. అసైన్డ్ భూమిలో ఫంక్షన్ హాల్ నిర్మాణం పనులు చేపట్టిన సదరు వ్యక్తికి నోటీసులు ఇచ్చి త్వరలో ఆ భూమిని స్వాధీనం చేసుకుంటామని ఆయన తెలిపారు.