ఏటీఎం వద్ద మోసాలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్...

తూప్రాన్ పట్టణ పరిధిలోని ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం ఆవరణలో అమాయకులను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతూ, డబ్బులు అపహరణ చేస్తున్న వ్యక్తిని పట్టుకుని 28 బెడిట్ కార్డులు 45 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ శివననాథం తెలిపారు

Update: 2024-09-19 14:51 GMT

దిశ,తూప్రాన్ : తూప్రాన్ పట్టణ పరిధిలోని ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం ఆవరణలో అమాయకులను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతూ, డబ్బులు అపహరణ చేస్తున్న వ్యక్తిని పట్టుకుని 28 బెడిట్ కార్డులు 45 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ శివననాథం తెలిపారు. వివరాల ప్రకారం తూప్రాన్ ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ఇస్లాంపూర్ కి చెందిన వ్యక్తి నుంచి రూ. 9.600 దాతర్ పల్లి కి చెందిన వ్యక్తి నుంచి రూ. 45 వేల రూపాయల అపహరించిన విషయం పై ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేయగా అమాయకుల దగ్గర డబ్బులు తీసి ఇస్తాం అని నమ్మించి ఏటీఎం కార్డు మార్చి గత కొన్ని రోజులుగా మోసాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. నిందితుడు హర్యానా రాష్ట్రానికి చెందిన శాహేడ గా గుర్తించారు. జేసీబీ నడుపుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. షకీల్ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఎస్ఐ శివననాథం తెలిపారు.


Similar News