100 సీట్లను గెలిచి రాష్ట్రంలో అధికారం చేపడతాం.. భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలోపడి పూర్తిగా నలిగిపోతుందని, ధరణి పేరుతో దొంగ సైటును తీసుకొచ్చి ప్రజలను నానా రకాలైన ఇబ్బందులు పెడుతూ ప్రజలు భూమిని కోల్పోతున్నామని గగ్గోలు పెడుతున్న ప్రజలను పట్టించుకొని ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వామని కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష (సీఎల్పీ) నేత మల్లుభట్టి విక్రమార్క అన్నారు.
దిశ, సూర్యాపేట ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలోపడి పూర్తిగా నలిగిపోతుందని, ధరణి పేరుతో దొంగ సైటును తీసుకొచ్చి ప్రజలను నానా రకాలైన ఇబ్బందులు పెడుతూ ప్రజలు భూమిని కోల్పోతున్నామని గగ్గోలు పెడుతున్న ప్రజలను పట్టించుకొని ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వామని కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష (సీఎల్పీ) నేత మల్లుభట్టి విక్రమార్క అన్నారు. బట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర సూర్యాపేటకు చేరుకున్న సందర్భంగా ఆదివారం జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం చేయలేనని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వెనుతిరిగిన సోమేశ్ కుమార్ తెలంగాణలో మళ్లీ ఏవిధంగా బాధ్యతలు చేపట్టారని విమర్శించారు.
ధరణి పేరుతో కేసీఆర్ సోమేశ్ కుమార్ లు ఉమ్మడి స్వలాభం కోసం సూత్రధారిగా సోమేశ్ కుమార్ పాత్రధారిగా కేసీఆర్ వ్యవహరిస్తూ పేదరైతుల భూములను కొల్లగొడుతూ ధరణి పేరుతో రైతులను నిలువునా ముంచేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఘనత గ్రామగ్రామాన బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి ప్రజలను తాగుబోతులుగా మార్చారని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలో మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న జగదీష్ రెడ్డి మొదలు పెట్టింది. రెండు ప్రాజెక్టులు ఒకటి భద్రాద్రి, రెండు యాదాద్రి అని అయినా ఇంతవరకు అవి పూర్తిచేయలేదు మరి ఇంకెన్ని సంవత్సరాలు అయినా వాటిని పూర్తిచేయరని అన్నారు.
ఇప్పటికీ 24 గంటలు కరెంటు ఇస్తున్న అని రాష్ట్రం మొత్తం చెప్పుకుంటున్నా కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డి అప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన ప్లాంట్లతోటే ఇచ్చి గొప్పలు చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి నిజాయితీ పరుడైతే మూడు రోజులు సూర్యాపేట జిల్లాలో పాదయాత్ర చేసి నేను అడిగే ప్రశ్నలకు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా గాని ముక్కుసూటిగా సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదశలో వందల ఆస్తులు అమ్ముకొని ప్రజలకు సేవచేస్తే నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు మంత్రులు వందల ఎకరాల ఆస్తులు కూడగట్టుకుని వేలకోట్లన్నీ వెనకేశారన్నారు.
ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు టీఆర్ఎస్ ను ఒడగొడదామని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లను గెలిచి రాష్ట్రంలో అధికారం చేపడతామని ధీమావ్యక్తం చేశారు. సూర్యాపేట గడ్డ త్యాగాల గడ్డ అని తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కీలక పాత్ర సూర్యపేట ప్రజలు పోషించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్నయాదవ్, నల్లగొండ పార్లమెంటరీ ఇంచార్జ్ నిరంజన్, సినీ నిర్మాత బండ్ల గణేష్, టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి, పీపుల్స్ మార్చ్ కన్వీనర్ అబ్దుల్లా, అధికార ప్రతినిధులు జ్ఞాన సుందర్, వెంకన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు.