కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి

కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసి స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించాలని తెలంగాణ సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు.

Update: 2025-01-01 11:26 GMT

దిశ, చౌటుప్పల్ టౌన్ : కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసి స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించాలని తెలంగాణ సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపుమేరకు.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో చదువుల తల్లి సావిత్రిబాపూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం నిర్వహించే మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ..ముద్రించిన వాల్ పోస్టర్లను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ..బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 3న హైదరాబాద్ ఇందిరపార్క్ లో నిర్వహిస్తున్న మహాసభను విజయవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీ మేరకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించి రాష్ట్రంలో ఉన్న 55 శాతం బీసీలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కురుమ సంఘం నాయకుడు చిన్నం బాలరాజు, గౌడ సంఘం నాయకుడు ముప్పిడి శ్రీనివాస్ గౌడ్, సిద్ధగోని శ్రీనివాస్ గౌడ్, సుర్వి లింగస్వామి, వినోద్ గౌడ్, కారింగ రాములు, మర్రి మహేందర్ యాదవ్, చౌటుప్పల్ బీసీ సెల్ నాయకుడు గంగాదేవి రమేష్ బాబు, నారీ బాలరాజు, కవిత, నరసింహ తదితరులు పాల్గొన్నారు.


Similar News