బీర్ల ఐలయ్య ప్రభంజనం

కేసీఆర్ పదేళ్ల పాలనలో నీళ్లు, నిధులు, నియామకాలని నిరుద్యోగులను నిండా ముంచారని విమర్శించారు.

Update: 2023-10-17 13:08 GMT

దిశ, బొమ్మలరామారం: కేసీఆర్ పదేళ్ల పాలనలో నీళ్లు, నిధులు, నియామకాలని నిరుద్యోగులను నిండా ముంచారని విమర్శించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్ తన కుటుంబంలో మాత్రం అందరికీ పదవులు కట్టబెట్టుకున్నారని ఆలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్ల ఐలయ్య ఆరోపించారు. మంగళవారం మండలంలోని చౌదరిపల్లి, మాచన్ పల్లి, నాయకుని తండా, కేకే తండా, చీకటిమామిడి, మర్యాల, పిలిగుండ్ల తండాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత సీఎంతో పాటు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేశారన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పి, ఇప్పుడు గృహలక్ష్మీ పేరుతో మూడు లక్షలు ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను చూసి సీఎం కేసీఆర్‌కు భయం పుట్టుకుందన్నారు. ఈ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. చౌదరిపల్లి, మాచన్ పల్లితో పాటు మర్యాల గ్రామానికి చెందిన సీనియర్ బీఆర్ ఎస్ పార్టీ నాయకులు తోట వెంకటేష్, ఈదులకంటి దయాకర్ రెడ్డి లతో పాటు వంద మంది కి పైగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామ గ్రామాన ఐలయ్య ఎన్నికల ప్రచార సభల్లో సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల మద్దతును పొందుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్యే పై అసహనానికి గురైన నాయకులు స్వచ్ఛందంగా బీర్ల కు మద్దతు తెలుపుతుండడంతో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం మండలంలో కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం, ఆగం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జంగా రెడ్డి, యెనగండ్ల సుధాకర్, మర్రి కృష్ణా రెడ్డి, చీర సత్యనారాయణ, రాజు నాయక్, మోకు మధుసూదన్ రెడ్డి, బాబు, మహిళా అధ్యక్షురాలు సునీత, బాలకృష్ణ, అందే మహేష్ తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News