నేనైతే అవినీతి బీఆర్ఎస్ మంత్రులను జైలుకు పంపేవాడిని..
గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ నేతలు ఓఆర్ఆర్,యాదాద్రి పవర్ ప్లాంట్,మిషన్ భగీరథ, కాళేశ్వరం, ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు అప్పు చేసి కమీషన్ల పేరుతో జేబులు నింపుకున్నారని,అభివృద్ది మాత్రం కాగితాలకే పరిమితమైందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, మునుగోడు; గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ నేతలు ఓఆర్ఆర్,యాదాద్రి పవర్ ప్లాంట్,మిషన్ భగీరథ, కాళేశ్వరం, ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు అప్పు చేసి కమీషన్ల పేరుతో జేబులు నింపుకున్నారని,అభివృద్ది మాత్రం కాగితాలకే పరిమితమైందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని తన వ్యక్తిగత కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రేస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిందని ఏనాడు పతిపక్షనాయకులపై కక్ష్య సాదింపులకు పాల్పడలేదన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచివాడు కాబట్టే బీఆర్ఎస్ నేతలపై ఉదారంగా వ్యవహరిస్తున్నాడని, తానే రేవంత్ రెడ్డి స్థానంలో ఉంటే కేసిఆర్,కేటిఆర్,జగదీశ్వర్ రెడ్డి ఏనాడో జైలుకు పంపించేవాడినన్నారు. ఇచ్చిన ప్రతి హామిని కాంగ్రేస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. గత పదేళ్ల కాలంలో ప్రజల ఆశలను బీఆర్ఎస్ అరిహశలు చేసిందన్నారు. మునుగోడు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గ ప్రజలను పోరైడ్ నుండి శాశ్వతంగా విముక్తి కల్గిస్తామన్నారు. మునుగోడు నియోజకవర్గంలో చిన్నవి,పెద్దవి కలిపి సుమారు 502 చెరువులు ఉన్నాయని, అతి త్వరలో సుమారు 150కు పైగా చెరువులకు నీరు అందించేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. మునుగోడు నియోజకవర్గాన్నివిద్య,వైద్యం,తదితర అన్ని రంగాలలో అభివృద్ది చేసి..ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్దాలన్నదే తన అంతిమ లక్ష్యమన్నారు. ఆయన వెంట ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మేకల ప్రమోద్ రెడ్డి, కాంగ్రేస్ మండలాధ్యక్షులు బీమనపల్లి సైదులు, నాయకులు వేమిరెడ్డి జితేందర్ రెడ్డి, పాల్వాయి జితేందర్ రెడ్డి, బుజ్జి, నారాయణ, రాముయాదవ్, రాజేష్, శ్రీను, ఆరెళ్ల సైదులు, తదితరులు పాల్గోన్నారు.