భార్య తిట్టిందని భర్త ఆత్మహత్య

మనస్థాపంతో ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శాలిగౌరారం మండలంలోని వల్లాల గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.

Update: 2024-12-11 16:23 GMT

 దిశ,శాలిగౌరారం : మనస్థాపంతో ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శాలిగౌరారం మండలంలోని వల్లాల గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. శాలిగౌరారం ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..శాలిగౌరారం మండలంలోని వల్లాల గ్రామానికి చెందిన మాధగోని ప్రశాంత్ (30)అనే యువకుడు తన వ్యవసాయ భూమిలోఉరి వేసుకొని మృతి చెందాడు. గత నాలుగు సంవత్సరాల క్రితం సూర్యాపేట టౌన్ కి చెందిన శివలీలతో వివాహం జరిగింది. వీరికి రెండు సంవత్సరాల పాప ఉంది. భార్యాభర్తల మధ్య గొడవలు రాగా..మృతుడి భార్య తన తల్లిగారింటికి వెళ్ళిపోయింది. అక్కడ పెద్దమనుషుల్లో పంచాయతీ పెట్టగా..పంచాయతీ పెద్దల ముందు మృతుడి భార్య,అత్త ,బామ్మర్ది బాగా తిట్టారని సమాచారం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మాధగోని ప్రశాంత్ మంగళవారం రాత్రి ఉరేసుకొని మృతి చెందాడు. దీంతో మృతుడి తండ్రి యాదయ్య ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సైదులు తెలిపారు.

Tags:    

Similar News