మానవత్వం చాటుకున్న పోలీస్ సిబ్బంది..అసలు ఏమైందంటే..?

పోలీసులు అంటే ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయం.

Update: 2024-12-31 16:32 GMT

దిశ,తుంగతుర్తి: పోలీసులు అంటే ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయం. దీనిపై పలువురు వివిధ రకాలుగా వ్యాఖ్యానిస్తుంటారు. అయితే ఇవేమీ కాకుండా మేము కూడా మనుషులమే..మాకు మానవత్వం ఉంది...దయ,జాలి...ఇలా చెప్పుకుంటూ పోతే.. జనంలో మేము... ప్రజా సేవలో మేము..అని నిరూపించుకున్నారు తుంగతుర్తి పోలీస్ స్టేషన్ లో పనిచేసే కానిస్టేబుళ్లు సైదులు,బుచ్చి రాములు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం సాయంత్రం తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. అందులో ఒక వ్యక్తి పూర్తిస్థాయిలో స్పృహ తప్పి కింద పడిపోయారు. అటుగా వెళుతున్న పోలీస్ కానిస్టేబుళ్లు సైదులు,బుచ్చి రాములు పరిస్థితిని గమనించి హుటాహుటిన అక్కడికి చేరుకొని కిందపడ్డ వ్యక్తిని లేపుతూ పలువురు సహాయంతో పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడ సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడంతో..కానిస్టేబుళ్లు సైదులు ,బుచ్చి రాములు చేతులపై మోసుకొచ్చి మరొకరి ద్విచక్ర వాహనంపై మరో ఆసుపత్రికి తరలించారు. పోలీసు సిబ్బంది చూపెట్టిన మానవత్వం,చొరవపై అక్కడున్న వారు ప్రశంసలు కురిపించారు. 


Similar News