నేలవాలిన రైతుల ఆశలు…!

అకాల వర్షానికి నేలకొరిగిన వరి పంట పొలాలకు నష్టపరిహారం అందించాలని మాజీ వైస్ ఎంపీపీ పాధురి గోవర్ధన కోరారు.

Update: 2024-10-11 11:00 GMT

దిశ వేములపల్లి : అకాల వర్షానికి నేలకొరిగిన వరి పంట పొలాలకు నష్టపరిహారం అందించాలని మాజీ వైస్ ఎంపీపీ పాధురి గోవర్ధన కోరారు.వేములపల్లి మండలం రావువారిగూడెం సమీపంలో వర్షాలకు నేలకొరిగిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మరో పది పదిహేను రోజులలో కోతకు వచ్చే పొలాలు వేల ఎకరాలలో పంటలు వర్షం నీటిలో మునిగాయని అన్నారు. దీంతో సగానికి పైగా పంట చేతికి రాని పరిస్థితి మిగతా పంటను రక్షించుకునేందుకు వరికట్టలు కట్టించాలన్నారు. ప్రస్తుత కూలి రేట్లతో పండిన పంట కూలీలకు పెట్టుబడికి సరిపోయే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేలకొరిగిన పంట పొలాలకు నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాడుగులపల్లి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రొండి శ్రీనివాస్, రైతు సంఘం అధ్యక్షుడు వల్లమల్ల ఎల్లయ్య, సిఐటియు మండల కార్యదర్శి కోడి రెక్క వెంకన్న, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి జిల్లా కమిటీ సభ్యులు రెమడాల బిక్షం, పెంటమల్ల సుకన్య, మహిళా సంఘం అధ్యక్ష కార్యదర్శులు అనిరెడ్డి మాధవి, పొదిల లక్ష్మమ్మ మండల నాయకులు పోదిల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


Similar News