నిరుపేదల ఆరోగ్య సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే కుంభం

నిరుపేదల ఆరోగ్య సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.

Update: 2024-06-26 16:19 GMT

దిశ,వలిగొండ:- నిరుపేదల ఆరోగ్య సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక కేంద్రం ఆవరణలో 15వ ఆర్థిక సంఘం నిధులు 1 కోటి 50 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన భవన ప్రారంభోత్సవానికి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథులుగా హాజరై నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మెరుగైన వైద్య సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని, నిరుపేదలు వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని సూచించారు.

అంతకుముందు మండలంలోని ప్రొద్దటూర్ గ్రామంలో 15 వ ఆర్థిక సంఘం 20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రం భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలోని స్త్రీ శక్తి భవనంలో మహిళ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టుమిషన్ కేంద్రాన్ని వారు ప్రారంభించి మహిళల ఆర్థిక స్వావలంబనతోనే సమాజం ప్రగతి సాధిస్తుందని,మహిళ సాధించే ఆర్థిక ప్రగతితోనే కుటుంబ ప్రగతి సాధ్యమౌతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమేష్ ,జడ్పీటీసీ వాకిటి పద్మా అనంతరెడ్డి, వైస్ ఎంపీపీ బాతరాజు ఉమా బాలనర్సింహ, అదనపు డీఆర్డీవో శ్రీనివాస్, వైద్యాధికారులు డాక్టర్ సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Similar News