ధాన్యం కాంటాలకు హమాలీలు డబ్బు డిమాండ్..

మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కాంటాలు నత్తనడకన సాగుతున్నాయి.

Update: 2023-04-26 14:33 GMT

దిశ, మిర్యాలగూడ : మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కాంటాలు నత్తనడకన సాగుతున్నాయి. డబ్బులు ఇచ్చిన రైతుల ధాన్యాన్ని మాత్రమే హమాలీలు కాంటాలు వేస్తున్నారు. దీంతో చిన్న, సన్నకారు రైతులు రోజుల తరబడి మార్కెట్లోనే నిరీక్షిస్తున్నారు. బుధవారం మండల పరిధిలోని ఆలగడప, సుబ్బారెడ్డి గూడెం, రాయిని పాలెం, ముల్కల కాల్వ తదితర గ్రామాల రైతులు ఆందోళన చేశారు.

మార్కెట్ కి ధాన్యం తెచ్చి నెలరోజులు దాటినా హమాలీలు ధాన్యం కాంటాలు వేయట్లేదని, బస్తాకి రూపాయ చొప్పున లంచం ఇచ్చిన వారి ధాన్యం ముందుగా కాంటా వేస్తున్నట్లు ఆరోపించారు. పేద రైతులు రోజుల తరబడి నిరీక్షిస్తున్నమని అధికారులు స్పందించి కాంటాలు వేగంగా జరిగేలా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News