మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం అని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు.
దిశ, దేవరకొండ : మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం అని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. నేరెడుగొమ్ము మండల పరిధిలోని వైజాక్ కాలనీ వద్ద నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 13 లక్షల రవ్వ, బొచ్చ, మ్రింగళ చేప పిల్లలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధియే ధ్యేయంగా చేప పిల్లలు పంపిణీ చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో చేప పిల్లలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చేపల ఉత్పత్తి గణనీయంగా పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని సూచించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా సీఎం రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటయ్య, మండల పార్టీ అధ్యక్షులు కృష్ణయ్య, మాజీ జెడ్పీటీసీ బాలు నాయక్, మాజీ ఎంపీపీ బిక్కు నాయక్, సీనియర్ నాయకులు యుగంధర్ రెడ్డి, పాపనాయక్, కొండల్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ డాక్టర్ వేణుధర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ, కోరెట్ల మాజీ సర్పంచ్ ధోండేటి మల్లా రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు లక్ష్మి, శ్రీనివాస్, హన్మ నాయక్, జైపాల్ నాయక్, హెమ్లానాయక్, కేతావత్ రమేష్ నాయక్, వైజాగ్ బంగారి, జిల్లా అధికారి సరిత, అభివృద్ధి అధికారి మారయ్య, సీఐ సురేష్, ఎస్సై సతీష్ పాల్గొన్నారు.