National News : సయ్యద్ ఇస్మాయిల్ కు కీలక బాధ్యతలు అప్పగించిన కాన్ఫడరేషన్ ఆఫ్ దళిత్

కాన్ఫడరేషన్ ఆఫ్ దళిత్, ఓబీసీ, మైనార్టీస్, ఆదివాసీ ఆర్గనైజేషన్స్ జాతీయ వైస్ చైర్మన్ గా సయ్యద్ ఇస్మాయిల్ నియమితులయ్యారు.

Update: 2024-11-07 14:28 GMT

దిశ, వెబ్ డెస్క్ : కాన్ఫడరేషన్ ఆఫ్ దళిత్, ఓబీసీ, మైనార్టీస్, ఆదివాసీ ఆర్గనైజేషన్స్ జాతీయ వైస్ చైర్మన్ గా సయ్యద్ ఇస్మాయిల్ నియమితులయ్యారు. ఇస్మాయిల్ ను వైస్ ఛైర్మన్ గా నియమిస్తూ కాన్ఫడరెషన్ జాతీయ ఛైర్మన్, మాజీ ఎంపీ డాక్టర్ ఉదిత్ రాజ్ నియామక పత్రాన్ని అందజేశారు. రాజ్యాంగ పరిరక్షణ, 50 శాతం రిజర్వేషన్ల పరిమితి తొలగింపు, కులగణన, వక్ఫ్ బోర్డులో కేంద్ర ప్రభుత్వ అనవసర జోక్యం, ఉన్నత న్యాయస్థానాల్లో రిజర్వేషన్లు, భూమి లేని పేదలకు భూమి, సమాన విద్యా, మత స్వేచ్ఛ, ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో రిజర్వేషన్ల అమలు, రైతులకు కనీస మద్దతు ధర, ఆదివాసీలకు మంచి నీటి సౌకర్యం, భూమి, వసతుల కల్పన, ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం, బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు వంటి అంశాలపై ఈ కాన్ఫడరేషన్ పోరాడుతుంది. ఈ కాన్ఫడరేషన్ లో పలు దళిత ఓబిసీ మైనార్టీ, ఆదివాసీ సంఘాలు ఉన్నాయి.

తెలంగాణ కు చెందిన సయ్యద్ ఇస్మాయిల్ విద్యార్థి దశ నుంచే పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ భావజాలంతో అణగారిన వర్గాలకు అండగా ఉంటూ... వారి హక్కుల కోసం పోరాడే సంస్థల్లో భాగస్వాములుగా ఉంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో కోదాడ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించారు. గతంలో పలు మీడియా సంస్థల్లో జర్నలిస్టుగా పనిచేశారు. ఐజేయూ జాతీయ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా సేవలు అందించారు. మాజీ ఎంపీ కాన్ఫడరేషన్ ఛైర్మన్ ఉదిత్ రాజ్.. తనపై ఎంతో నమ్మకంతో ఈ పదవిని అప్పగించారని ఆయన నమ్మకాన్ని వమ్ముచేయకుండా కాన్ఫడరేషన్ లక్ష్యం కోసం జాతీయ స్థాయిలో పనిచేస్తానని తెలిపారు.


Similar News