ఎందరో త్యాగాల ఫలితం స్వాతంత్య్రం

ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్ర్య దినోత్సవం అని, స్వాతంత్ర్య ఫలాలు అందరికీ పంచాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Update: 2024-08-15 10:53 GMT

దిశ, సూర్యాపేట కలెక్టరేట్ : ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్ర్య దినోత్సవం అని, స్వాతంత్ర్య ఫలాలు అందరికీ పంచాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ సన్ ప్రిత్ సింగ్ తో కలిసి పాల్గొన్నారు. జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. తదుపరి పోలీస్ శాఖ వారిచే ఏర్పాటు చేసిన ఓపెన్ టాప్ వాహనంలో జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కలిసి సంప్రదాయ పోలీస్ కవాతుతో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటలలో మహాలక్ష్మి, ఆరోగ్య శ్రీ పథకాలను పేదలకు అందించామని, జిల్లాలో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా ఆర్టీసీ బస్సు లలో 1.29 కోట్ల మంది మహిళలు ఇప్పటి వరకు ప్రయాణించారని, వీరికి 66.84 కోట్ల

    రూపాయల సబ్సిడీని ప్రభుత్వం చెల్లించిందన్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యంను అందించుటకు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ఐదు లక్షల నుండి పది లక్షలకి పెంచటం జరిగిందని, జిల్లాలో ఈ పథకం ద్వారా 19096 మంది చికిత్స పొందారని తెలిపారు.పేదోళ్ల సొంత ఇంటి కలను నెరవేర్చుటకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రాష్ట్రంలో 4.5 లక్షల ఇళ్లు నిర్మించుటకు ఇంటికి 5 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వటం జరుగుతుందన్నారు. హుజూర్ నగర్ ఆదర్శ కాలనీలో 2160 ఇండ్ల పునరుద్దరణ పనులు 74.80 కోట్లతో జరుగుతున్నాయని, అలాగే గ్యాస్ సిలిండర్ ని 500 రూపాయలకే అందిస్తున్నామని ఇప్పటి వరకు జిల్లాలో 1.48 లక్షల మంది లబ్ధిదారులకు 7 కోట్ల రూపాయల సబ్సిడీ తో 2.37 లక్షల గ్యాస్ సిలిండర్లు అందజేశామన్నారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల విద్యుత్ ని ఉచితంగా అందజేయటం జరిగిందని జిల్లాలో 1.75 లక్షల కుటుంబాలకు 28.5 కోట్ల రూపాయలతో ఉచిత విద్యుత్ ని అందజేస్తున్నట్టు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణ మాఫీ చేయటం జరిగిందని,

     జిల్లాలో రెండు విడుతలలో కలిపి 82,593 మంది రైతులకు 573 కోట్లు రుణ మాఫీ చేశామన్నారు. పౌర సరఫరాల శాఖ ద్వారా 3.24 లక్షల ఆహార భద్రత కార్డులకి నెలకి 5,946 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయటం జరిగిందని, అలాగె 43,125 మంది రైతుల ద్వారా 530 కోట్ల విలువ గల 2,40,578 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించామన్నారు. నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ద్వారా జిల్లాలో 519.77 కోట్లతో ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశామని, 418 కోట్లతో నాగార్జున సాగర్ ఎడమ కాలువ, 144 కోట్లతో మూసీ ప్రాజెక్ట్ కాలువల ఆధునీకరించామని, 244.45 కోట్లతో 20 చెక్ డ్యామ్ లు నిర్మిస్తున్నామని చెప్పారు. వీటిలో 19 పూర్తి అయ్యాయని, జాన్ పహాడ్ ఎత్తి పోతల పథకం కింద 40 కోట్లతో 210 ఎకరాల భూమిని సేకరించామన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 389.14 కోట్ల విలువగల చెక్కులను 43,711 లబ్ధిదారులకు ఇచ్చామన్నారు. ధరణి కింద

    జిల్లాలో 56,266 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 94 శాతం పరిష్కరించామని మంత్రి తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా 2,62,000 మందికి జాబ్ కార్డులు ఇవ్వటం జరిగిందని, వీరికి 49,12,000 పని దినాల ఉపాధి కల్పించామని, దీనికి గాను 107.38 కోట్ల రూపాయలు చెల్లించామని, 49,044 మందికి 36.94 కోట్లు పింఛన్ ఇచ్చామని, 1057 సదరం సర్టిపికెట్స్ ఇచ్చామని, బ్యాంక్ లింకేజీ ద్వారా ఎస్​హెచ్​జీలకు 198.18 లక్షల రుణాలు ఇచ్చామని, 9.92 కోట్ల వడ్డీ రుణ మాఫీ చేశామని చెప్పారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులైన సూర్యాపేట నివాసి అంజయ్య, గరిడేపల్లి నివాసి పుల్లారెడ్డి, సూర్యాపేట నివాసి జానకి రాములకు సన్మానం చేశారు. తదుపరి విద్యార్థులచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను విక్షించి విద్యార్థులతో ఫొటోలు దిగి ప్రోత్సాహించారు. 52.44 కోట్ల రూపాయల చెక్కు ని స్వయం సహాయక సంఘాల వారికి, 35.36 కోట్ల రూపాయల చెక్కును మెప్మా వారికి మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, ఆర్డీఓ వేణు మాధవ్, జెడ్పీ సీ ఈ ఓ అప్పారావు, డీపీఓ యాదగిరి, డీడబ్ల్యూ ఓ నరసింహ రావు, డీటీడీఓ శంకర్, డీఈ ఓ ఆశోక్, ఉద్యోగులు, సిబ్బంది,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News