ప్రజల్లో ఎన్నికల పట్ల అత్మవిశ్వాసం కలిగేలా ఫ్లాగ్ మార్చ్

త్వరలో రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

Update: 2024-03-12 14:59 GMT

దిశ, నల్గొండ: త్వరలో రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా, ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునెలా వారిలో నమ్మకం, భరోసా, భద్రత కలిగేలా జిల్లా పోలీసులు, ఐటీబీపీ కేంద్ర సాయుధ బలగాలు ఫ్లాగ్ మార్చ్ కవాతు నిర్వహించడం జరిగింది అని జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. పట్టణ కేంద్రంలో జిల్లా పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు ఫ్లాగ్ మార్చ్ కవాతును క్లాక్ టవర్, విటి కాలనీ హనుమాన్ టెంపుల్, ఎల్‌వీ కుమార్ పెట్రోల్ బంక్, శివాజీ నగర్, చందమామ టవర్స్, రామగిరి, క్లాక్ టవర్ వరకు ఫ్లాగ్ మార్క్స్ నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లలో ఎలాంటి భయాందోళనకు తావు లేకుండా చేయడంలో భాగంగా జిల్లా పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు ఫ్లాగ్ మార్చ్ ద్వారా ప్రజలందరికీ ఎన్నికల పట్ల భద్రత, భరోసా కల్పించడానికి ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా సమస్యత్మక గ్రామాల పై ప్రత్యేక దృష్టి సారించి జిల్లాలోని అన్ని మండలాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని, పార్లమెంట్ ఎన్నికలలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా పారదర్శకంగా ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు జిల్లా పోలీసు సిబ్బందితో పాటు కేంద్ర సాయుధ బలగాలు కలిసి విధులు నిర్వర్తిస్తాయని తెలిపారు. బందోబస్తు మాత్రమే కాకుండా డబ్బు, మద్యం, ఇతర విలువైన వస్తువులు అక్రమ రవాణా అరికట్టేందుకు చెక్‌ పోస్టుల్లో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, సీఐలు సత్యనారాయణ, డానియల్, కరుణాకర్, ఎస్.ఐలు సిబ్బంది, కేంద్ర సాయుధ బలగాలు పాల్గొన్నారు.


Similar News