శానిటైజర్ తాగి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

అస్సాం రాష్ట్రానికి చెందిన విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన కోదాడ పట్టణంలోని స్నేహ నర్సింగ్ కళాశాలలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

Update: 2024-11-28 12:55 GMT

దిశ,కోదాడ : అస్సాం రాష్ట్రానికి చెందిన విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన కోదాడ పట్టణంలోని స్నేహ నర్సింగ్ కళాశాలలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..అస్సాం రాష్ట్రానికి చెందిన నర్గెస్ పర్బిన్ అనే యువతి స్నేహ నర్సింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం హాస్టల్లో ఉండి చదువుతుంది. యాజమాన్యం కళాశాలలో ఫీజు చెల్లించాలని ఇబ్బందులకు గురి చేశారని,వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని తెలిపారు. ఎదురు మాట్లాడితే ఇష్టం వచ్చినట్లు దూషిస్తున్నారని తెలిపారు. కాగా కళాశాలలో విద్యార్థిని శానిటైజర్ రాత్రి తాగడంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి వార్డెన్ తీసుకొని వచ్చారు. అప్పటినుండి ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. కానీ యాజమాన్యం మాత్రం పత్తా లేకుండా పోవడంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టౌన్ ఎస్ఐ రంజిత్ రెడ్డి కళాశాలను సందర్శించి విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలను సహ విద్యార్థులను అడిగి తెలుసుకొని తల్లి దండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై కళాశాల యాజమాన్యాన్ని వివరణ కోరగా..కళాశాల ఫీజు అడిగితే ఈ విధంగా చేసుకుందని తెలిపారు. 


Similar News