ఎక్సైజ్ శాఖ తనిఖీల్లో భారీగా బెల్లం, పట్టిక పట్టివేత

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో..అధికారులు తనిఖీలు నిర్వహించారు.

Update: 2024-10-03 12:30 GMT

దిశ చింతలపాలెం: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో..అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో 360 కేజీల బెల్లం, 20 కేజీల పట్టికను స్వాధీనం చేసుకున్నారు. హుజూర్నగర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జిల్లా నాగార్జున రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం..చింతలపాలెం మండలం దొండపాడు గ్రామ శివారు వద్ద ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో..తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలలో చింతలపాలెం మండలం ఎర్రగుంట తండా గ్రామానికి చెందిన ధరావత్ చంటి అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై 80 కిలోల బెల్లం, 10 కిలోల పట్టిక ఆంధ్ర ప్రాంతం నుంచి తరలిస్తుండగా..దొండపాడు వద్ద తనిఖీలలో పట్టుబడి వాహనాన్ని సీజ్ చేశామన్నారు. అదేవిధంగా చింతలపాలెం మండలం కొత్తగూడెం తండాకు చెందిన తులసి రామ్ అనే వ్యక్తి తన ఆటోలో 280 కేజీల బెల్లం, 10 కిలోల పట్టిక తరలిస్తుండగా..దొండపాడు వద్ద పట్టుకున్నామన్నారు. నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. ఈ దాడులలో ఎస్సై దివ్య, సిబ్బంది రుక్మారెడ్డి, జయరాజ్,నవీన్,నాగమణి తదితరులు పాల్గొన్నారు.


Similar News